ePaper
Wednesday, June 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్వెనుకబడిన వర్గాల బాలికల చదువుకు బంగారు బాటలు వేస్తున్న.... కేజీబివి :*

వెనుకబడిన వర్గాల బాలికల చదువుకు బంగారు బాటలు వేస్తున్న…. కేజీబివి :*

📰 Generate e-Paper Clip

*👉ప్రతిభకు పట్టం కడుతున్న కేజీబీవీ విద్యార్థినిలు… 

 👉పదిలో స్కూల్ టాపర్ టీ .మస్తానమ్మ 584:*. 

 👉17 మంది విద్యార్థినిలకు 500 మార్కులు ఫై మాటే……*

👉100% పాస్……*.                   

 

 *మర్రిపాడు.(👉ప్రభాకర్ మేకల /✍️/ఇదినిజం బ్యూరో ఇంచార్జ్✍️ ):*.

ప్రభుత్వ పాఠశాలలకు సరిజోడి గా ప్రవేటు విద్యాలయాలకు దీటుగా మోడల్ స్కూల్ మాదిరి గా ప్రతిభకు పట్టం కడుతూ పదవ తరగతి పరీక్ష ఫలితలలో -100% ఉత్తీర్ణతతో 40/40 మంది మర్రిపాడు కేజీబీవీ విద్యార్థినిలువిజయభావుటా ఎగురవేసారు …సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన బాలికలకు ప్రత్యేకంగా నాణ్యమైన ఉచిత విద్య అందించడానికి ప్రధాన ఉద్దేశ్యం గా ఏర్పాటు చేసిన మర్రిపాడు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ప్రిన్సిపాల్ సిహెచ్ లక్షిదేవి సారథ్యంలో , టీచర్లు సమిష్ట కృషి,క్రమశిక్షణ విద్యా సంస్థలో బోధన, విలువలు మరియు ప్రవర్తనా నియమావళిని విద్యార్థినిలలో పెంపొందించి  ఉత్తమ బోధన, నాణ్యమైన విద్య,అందిస్తూ సమయపాలన పాటిస్తూ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు రాబట్టారు.కస్తూర్బా గాంధీ బాలికా విద్యార్థినులు 2026 సం.పదవ తరగతి లో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ సత్తా చాటారు. పాఠశాలలో మొత్తం పదవ తరగతి విద్యార్థినిలు 40 మంది కాగా అందరు పరీక్షకు హాజరై 100% ఉత్తీర్ణత సాధించారు టీ .మస్తానమ్మ 584/600, సాధించి పాఠశాలలో మొదటి స్థానం కాగా పి .మహిత 581/600 రెండవ స్థానం ఎం.మేరీ 579/600మూడవ స్థానంలో నిలిచారు. 17 మంది విద్యార్థినిలు 500 కు పైగా మార్కులు సాందించడం గమనార్హం.నిరుపేద, గ్రామీణ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, నాణ్యమైన విద్యను అందిపుచ్చుకుని ఉన్నత మార్కులు సాధించడంతో తల్లి దండ్రులు అనందం వ్యక్తం చేస్తున్నారు.ఆర్థికంగా వెనుకబడిన వర్గాల బాలికల చదువుకు ఈ పాఠశాలలు బంగారు బాటలు వేస్తున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!