ePaper
Wednesday, April 29, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంలో మేకపాటి మాల్యాద్రి నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు

ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంలో మేకపాటి మాల్యాద్రి నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు

📰 Generate e-Paper Clip

  • ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంలో దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామానికి చెందిన మేకపాటి మాల్యాద్రి నాయుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. సంస్థలో సభ్యుడిగా చేరిన నాటి నుంచి ఆయన వివిధ హోదాల్లో క్రమంగా ఎదుగుతూ, ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా, అనంతరం సౌత్ జోన్ అధ్యక్షుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక కావడం ఆయన సేవలకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నారు.మాల్యాద్రి నాయుడు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరిచారు. ధరల దోపిడీ, నాసిరకం వస్తువుల విక్రయం, తప్పుడు బిల్లింగ్ వంటి సమస్యలపై బాధితులకు సహాయం అందిస్తూ అనేక కేసుల్లో పరిష్కారాలు సాధించారు.అలాగే పేద, మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేకూరేలా ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ వినియోగదారుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అత్యవసర సందర్భాల్లో బాధిత కుటుంబాలకు అండగా నిలిచి, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ఆర్థిక సహాయం, అవసరమైన వస్తువులు అందించడం వంటి సేవలను కూడా కొనసాగించారు.యువతలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి, గ్రామస్థాయిలో సేవా కార్యక్రమాలను విస్తరించారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత కార్యక్రమాలు, విద్యా సహాయం వంటి రంగాల్లో కూడా తన సేవలను విస్తరించారు.ఈ సందర్భంగా మాల్యాద్రి నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రతి వినియోగదారునికి న్యాయం జరిగేలా పోరాడటం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కూడారి తిరుపాలు గారికి, ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ కదిరి వెంకట రంగారావులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంస్థకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యేలా సేవలు అందిస్తానని హామీఇచ్చారు
RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!