సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

0
3

📰 Generate e-Paper Clip

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత సీతారామపురం (ఇది నిజం ప్రతినిధి) సీతారామపురం మండలంలోని చిన్ననాగంపల్లి గ్రామానికి చెందిన మునగల రమణారెడ్డి అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో బాధపడిన విషయాన్ని స్థానిక నాయకుల ద్వారా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1,64000 రూపాయల చెక్కును మునగల రమణారెడ్డికి శనివారం మండల టిడిపి నాయకులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ ఆదేశాల ప్రకారం మండల టిడిపి కన్వీనర్ చింతల శ్రీనివాసులు సూచనలతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మునగల రమణారెడ్డికి అందించామన్నారు. మునగాల రమణ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకున్నందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు స్థానిక మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి మాజీ కన్వీనర్లు వెంగల శెట్టి వెంకటేశ్వర్లు, ముత్తం శెట్టి చెన్నకేశవులు, మండల టిడిపి యూత్ కన్వీనర్ పసుపులేటి వికాస్ బాబు, చిన్ననాగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు మళ్లెం కొండయ్య, సీనియర్ నాయకులు గాజులపల్లి చంద్రరెడ్డి, తురక వెంకటేశ్వర్లు, ఇజ్రాయిల్ ,పెనిబోయిన రమణయ్య, పెద్ద గౌస్, బండి రవికుమార్, కాజవలి, మధు తదితరులు పాల్గొన్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here