కుల వివక్ష ఫై సామాజిక శంఖారావం……

0
8

📰 Generate e-Paper Clip

కుల వివక్ష ఫై సామాజిక శంఖారావం…..

ఆత్మకూరు (ఇదినిజం ప్రతినిధి ): కుల వివక్ష లేని సమాజం కోసం కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సామాజిక శంఖారావం కార్యక్రమం ఆత్మకూరు రూరల్ మండలం మురగళ్ల గ్రామంలో ని దళితవాడలో నిర్వహించడం జరిగినది. తమ దళితవాడలో 80 కుటుంబాల వారిని నివసిస్తున్నామని అనాదిగా తమ పైన కుల వివక్ష కొనసాగుతుందని ప్రధాన గ్రామంలో కి దేవాలయ ప్రవేశం లేదని,తమ కు స్మశానం సమస్య వున్నదని,70మందికి సెంటు భూమి లేదని, తమ మీద రాజకీయ ఒత్తిడివున్న కారణంగా చేపల చెరువు లోని చేపలు పట్టుకోనీయ కుండా గత 4 సంవత్స రాలు గా ఇబ్బంది పెడుతున్నారని 20మందికి ఇళ్ల స్థలాల సమస్య వున్నదని తెలిపారు. ఈ అధ్యయన యాత్రలలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య జిల్లా కమిటీ సభ్యులు జి పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి త్రివిక్రమ్, గ్రామస్తులు పి.వెంకటేశ్వర్లు T.యాకోబు, పెంచల నరసయ్య, పోలిపోగు నరసయ్య, దండు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here