షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైన మర్రిపాడు ప్రతిభారత్నాలు….

0
7

📰 Generate e-Paper Clip

షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైన మర్రిపాడు ప్రతిభారత్నాలు….

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):

2025-26 విద్యా సంవత్సరానికి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన
మర్రిపాడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికై ప్రతిభారత్నాలుగా వెలుగొందడం వారిఅచంచలసంకల్పానికి,నిరంతర శ్రమకు,తల్లిదండ్రుల ప్రోత్సాహానికి,ఉపాధ్యాయుల నిబద్ధతతో కూడిన మార్గదర్శకత్వానికి నిలువెత్తు నిదర్శనం.విద్యార్థులు ఎంపిక అపార గౌరవాన్నినింపి మర్రిపాడు ప్రభుత్వ పాఠశాలలకు
వన్నెతెచ్చారని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అదే సందర్భంలో షైనింగ్ స్టార్ ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన విద్యార్థులను వారి తల్లిదండ్రులను వారికి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు .”ప్రతిభకు పట్టుదల తోడైతే విజయమే చిరునామా” అనే మాటను సాకారం చేస్తూ,ఈ విద్యార్థులు సాధించిన ఘనత భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి మర్రిపాడు మండలానికి ,పాఠశాల
లకు, తల్లిదండ్రులకు,సమాజానికి చిరస్థాయి కీర్తి తీసుకురావాలని మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఈనెల 20వ తేదీ సోమవారం నెల్లూరు లోని కస్తూరిబా కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో జిల్లా అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్,మెమెంటో మరియు ఇరవై వేల రూపాయలు పారితోషకం తో పాటు ఈ అవార్డును అందుకోవడం పలువురు విద్యార్థులకు ఆదర్శప్రాయమని మండల వాసులు అభినందిస్తున్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here