రహదారికి అడ్డంగా ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు..
మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి ):
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెల్లోను రహదారుల రూపురేఖలు మారుతున్నాయి.రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో పలుచోట్ల రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారు. మండలంలో ప్రమాదలకు నిలయంగా మారిన కూడళ్ళలో రహదారులను క్రమబద్దీకరిస్తున్నారు ఈ క్రమంలోనే మర్రిపాడు మండల పరిధిలోని నందవరం కూడలిలో నెల్లూరు ఉదయగిరి ని కలిపే రహదారిపై నందవరం కూడలి వై జంగ్సన్ దగ్గర జాతీయ రహదారిఫై ‘ ‘తరచూ ప్రమాదాలు జరుగుతు ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో స్థానిక తహసీల్దార్ రోజంతా తమ సిబ్బందితో అక్కడే ఉండి అక్రమ నిర్మాణాలను తొలగించి కూడలిని విస్తరణ చేయడానికి చర్యలు చేపట్టారు.
మధ్యలో ఉన్న దుకాణన్ని స్థానిక మంత్రి సహకారం తో అక్కడనుంచి మార్పించి కూడలని జెసిబి సహాయంతో చెట్లు పీకించి చదును చేసి కూడలని విస్తరింప జేశారు. ప్రయాణికుల వాహనాలకు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రమాదాల నివారణకు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ యాదవ్ చరిత్రలో నిలిచిపోయే శాశ్వత పరిష్కారానికి చేపట్టిన అక్రమ నిర్మాణ తొలగింపు పై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





