- మర్రిపాడు కరంట్ శాఖలో కంత్రి పనులు:
- వినియోగదారుకు వచ్చిన మెటీరియల్ స్వాహా…
- ఇరిగిపోయిన స్తంబాలు బిగించి కొత్తవిగా బిల్డప్పు…
- కరెంట్ కనెక్షన్ ఇవ్వకుండానే సర్వీస్ ఛార్జ్….?
- వినియోగదారులను,రైతులను పీడిస్తున్న విద్యుత్ అధికారులు.. మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):
మర్రిపాడు విద్యుత్ శాఖలో అవినీతి జలగలు రాజ్యమేలుతున్నాయి.గతంలో కొంత మంది అధికారులు,సిబ్బంది వినియోగదారులను,రైతులను పట్టి పీడిస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వినియోదరులకు వచ్చే వస్తువులను స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.ప్రతి పనికీ ఓ రేటుకట్టివసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విషయం ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుండటంతో అక్రమ సంపాదనకుతలుపులు బార్లా తెరిచారనే ఆరోపణలు వినవస్తున్నాయి.స్థానికంగా పనిచేసే అధికారులు సైతం పరోక్షంగాప్రోత్సహిస్తూ అక్రమార్కులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతోవారి అవినీతి సంపాదనకు అదుపు లేకుండా పోతుంది.వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ల స్తంబాలు ఏర్పాటులోఉద్దేశపూర్వక జాప్యం చేసి స్వాహా చేస్తున్నట్లు సమాచారం.మర్రిపాడు మండల పరిధిలో గతంలో విద్యుత్ శాఖ లో పనిచేసిన కొందరు అవినీతికి అడ్డూ అదుపులేకుండాపోయింది. పూర్తి వివరాలుచూస్తే అవగతం అవుతుంది.మర్రిపాడు మండలం బూదవాడ గ్రామంలో గోనా ప్రభుదాసు అనే వ్యక్తికి సర్వే నెం. 527/2లో 5 ఎకరాల మెట్ట వ్యవసాయానికి అనుకూలమైన పొలం ఉంది మెట్ట భూమికి 4విద్యుత్తు సర్వీసుల కోసం 2017వ సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నారు . దానికి సంబంధించిన రుసుమురూ.60,000/-డి డి గతంలో విధులు నిర్వహిస్తున్న గత విద్యుత్తు ఎ.ఇ. వెంకటేశ్వర్లు కు చెల్లించినట్లు ప్రభుదాస్ తెలియజేసారు.అయితే మసి పూసి మారేడుకాయలు అమ్మిన చందంగా ఏ. ఇ అప్పటినుండి మొన్నటి వరకు ఎటువంటి కొత్త విద్యుత్తు పరికరములు బిగించకుండానే, ఎటువంటి విద్యుత్తుసరఫరా జరుగకుండానే సర్వీసులను విడుదల చేసినట్లు రికార్డుల్లో చూపి ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. వెబ్ నందు 2017లో క్లోజ్ చేసినట్లు లబ్ధిదారుడు వివరించారు. సర్వ ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన ప్రభుదాస్ డయల్ యువర్ సి.ఎం.డి.కి తే. 05-01-2026న ఫిర్యాదుచేయడంతో (ఫిర్యాదు ఐ.డి.నెం. ఎన్ఎల్ఆర్ 202060105031) జూన్ 11వతేది కొత్త కనెక్షన్లు మంజూరు అయినట్లు సమాచారం అందింది ( Memo No. CGM / O & M / G.M./ E.E./ C/F.359326/D.No. 1343,)అయితే కొత్తగా వచ్చిన మెటీరియల్ కు పాతర వేసి విరిగిన పాత పోల్స్ నాటి ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్ ఇవ్వకుండానే పని పూర్తి అయినట్లు బిల్డప్ ఇస్తూ లబ్ధిదారుడి సంతకం కోరడం ఇడ్డురంగా ఉందని వినియోగదారుడు ప్రభుదాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు కనెక్షన్ ఇవ్వకుండానే బిల్లు వచ్చినట్లు సమాచారం.కొత్త మెటీరియల్ వచ్చాయని విద్యుత్ ఉన్నత అధికారులు సెలవిస్తే ఇన్ని ఇరిగిపోయిన పాత స్తంబాలు ఎక్కడి నుంచి తెచ్చారో అందులో ఆంతర్యం ఏమిటో తెల్చాలని ట్రాన్స్ఫార్మర్ల ఎక్కడ నుంచి తెచ్చారొ చెక్ చేయాలని వినియోగదారుడు కోరుతున్నారు. ఏ ఇ మర్రిపాడు లో ఉన్న సమయంలో 33లక్షల మోసం చేసారని అధికారులు విచారణలో తేలి సస్పెండ్ అయినా నాలుగు రోజుల్లో ఉద్యోగం దక్కించుకున్నారంటే పొలిటికల్ పవర్ అధికారికిఏమాత్రంఉందొఅర్ధంచేసుకోగలరు.వినియోగదారుల సేవలకు పెద్ద పీట వేయాలనిసీఎండీ స్థాయిలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలు కావడంలేదనేది స్పష్టమౌతుంది.
విద్యుత్ శాఖలో, అక్రమ లైన్ షిఫ్టింగ్లు, దొంగ ట్రాన్స్‌ఫార్మర్లు, అధికారుల నిర్లక్ష్యం ఫై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయాలను పరిగననలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే మర్రిపాడు కరంట్ శాఖ లో ఇంకా మరిన్ని కంత్రి పనులు బయటకి వచ్చే అవకాశం ఉందని విద్యుత్ వినియోగదారుడు ప్రభుదాస్ కోరుతున్నారు.





