ePaper
Monday, July 20, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్బాకీ విషయమై వ్యక్తిపై దాడి..

బాకీ విషయమై వ్యక్తిపై దాడి..

📰 Generate e-Paper Clip

హాస్పటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు తోడేటి పెంచల నరసయ్య*

*బాధితున్ని పరామర్శించిన కెవిపిఎస్ జిల్లా నేత నాగయ్య*

ఆత్మకూరు (ఇదినిజం ప్రతినిధి ):

ఆత్మకూరు మండలం మురగళ్ళ గ్రామానికి చెందిన తోడేటి పెంచల నరసయ్య అనే దళిత వ్యక్తి ఆత్మకూరులో ప్రధాన వీధిలో వెళుతూ ఉండగా పట్టణానికి చెందిన వ్యాపారి ఒకరు పెంచలయ్య బాకీ ఉన్నట్లు ఆ బాకీ విషయమై నిలదీయగా తాను బాకీ లేదని చెప్పడంతో ఆ వ్యాపారి పెంచలయ్య పై దాడికి పాల్పడి చేతిలోని సెల్ ఫోన్ లాక్కొని కులం పేరుతో బూతులు తిడుతూ దాడి చేశాడని పెంచలయ్య ఆరోపిస్తూ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.. ఓ దళిత వ్యక్తిని అందులో వయసు మీద పడిన వ్యక్తిపై కనికరం లేకుండా నడి బజారులో దాడికి పాల్పడి కుల దూషణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు కుల వివక్షత పోరాట సమితి జిల్లా నాయకులు ఆత్మకూరు నాగయ్య తెలిపారు.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుడిని నాగయ్య పరామర్శించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పెంచలయ్య పై దాడికి పాల్పడిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే తాము ఉద్యమం చేపడతామని నాగయ్య తెలిపారు…

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!