ePaper
Saturday, April 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్కెజిబివిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం...

కెజిబివిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…

📰 Generate e-Paper Clip

మర్రిపాడు కెజిబివిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం…ప్రిన్సిపాల్ సిహెచ్ లక్ష్మి దేవి.

 

 

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కేజీబివి ప్రిన్సిపాల్ సిహెచ్ లక్ష్మి దేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉంటాయని చెప్పారు. ఈ నెల 12 నుండి ఏప్రిల్‌ ఒకటో తేది వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.ఎంపికైన విద్యార్థినుల జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తారు.

6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్‌లో (1year )40 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.బాలికలకు ఉచిత రెసిడెన్షియల్ విద్య, హాస్టల్, భోజనం, పుస్తకాలు, యూనిఫాం సౌకర్యాలు. పాఠశాలల్లో ప్రవేశానికి కేవలం బాలికలు మాత్రమే అర్హులని చెప్పారు. ముఖ్యంగా అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్‌ (బడి మానేసిన వారు), పేద విద్యార్థినులు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, బిపిఎల్‌ కుటుంబాలకు చెందిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు apkgbv.apcffss.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.పూర్తి వివరాల కొరకు కేజీబీవీ ప్రిన్సిపాల్ లక్ష్మీదేవిఫోన్( 9000850953..) సంప్రదించవలెను..

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!