ఆత్మకూరు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ )రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు,ఆత్మకూరు యువ కెరటం టిడిపి యువనాయకుడు మట్లి సురేంద్ర రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని మంత్రి నివాసానికి వెళ్లి మంత్రిని దుస్సాలువతో ఆత్మీయంగా సత్కారించారు.
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సురేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలో విలువలకు కట్టుబడి, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాయకుడిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక గుర్తింపు పొందారని ఆయన కొనియాడారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, పరిపాలనలో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, దేవాదాయ శాఖ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.శుక్రవారం ఉదయాన్నే ఆత్మకూరు పట్టణంలోమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 75 వ జన్మదిన వేడుకలు సందర్బంగా స్థానిక బస్టాండ్ సెంటర్లో అన్నా క్యాంటీన్ సమీపంలో టిడిపి పట్టణ అధ్యక్షులు చంద్రారెడ్డి అధ్యక్షతన టిడిపి నాయకులు మట్లి సురేందర్ రెడ్డి దాతృత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా దాత మట్లి సురేందర్ రెడ్డి మునిసిపల్ సిబ్బందికి , మెప్మా సిబ్బందికి, విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు మహిళలకు చీరలు పంపిణీ చేసి మట్లి సురేందర్ రెడ్డి దాతృత్వం చాటుకున్నారు.





