హైదరాబాదుకు వెళ్లే ప్రైవేటు బస్సులు తనిఖీ.
ఏ ఎస్ పేట (ఇది నిజం ప్రతినిధి హరికృష్ణ) ఏఎస్ పేట నుండి హైదరాబాదుకు వెళ్లే ప్రైవేట్ బస్సులను ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలు మేరకు మంగళవారం సాయంత్రం ఏఎస్పేట ఎస్సై జిలాని తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయా లేదా అన్ని అనుమతులు ఉన్నాయా లేదా ప్రయాణికులకు అన్ని వసతులు కల్పిస్తున్నారా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ ఫ్రీ యాక్సెస్ డోర్ సిస్టం మరియు ఫైర్ ఎగ్జిస్టింగ్ సిస్టం ఉందా లేదా మరియు వాహన పత్రాలు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా డ్రైవర్లకు లైసెన్సులు ఉన్నాయా లేదా ఇలా అన్ని అంశాలను తనిఖీలలో పరిశీలించినట్లు ఏఎస్పేట ఎస్సై జిలాని తెలిపారు ప్రయాణ సమయంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డ్రైవర్లకు ఎస్ఐ పలు సూచనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పేట ఎస్సై జిలాని తోపాటు పోలీసులు పాల్గొన్నారు




