అదుపుతప్పిన అపాచి బస్సు గోడను ఢీకొట్టిన వైనం. ః

0
3

📰 Generate e-Paper Clip

అదుపుతప్పిన అపాచి బస్సు గోడను ఢీకొట్టిన వైనం. బస్సు డ్రైవర్ తీవ్ర గాయాలు, అపస్మారిక స్థితిలో డ్రైవర్   కార్మికులకు తప్పిన పెను ప్రమాదం. ః సూళ్లూరుపేట డివిజన్ ఇన్చార్జి తడ మండలం               (ఇది నిజం ప్రతినిధి) ః

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం మాంబట్టు సెజ్ అపాచి బస్సు కు ప్రమాదం చోటుచేసుకుంది. అపాచి పరిశ్రమకు చెందిన కార్మికులను తీసుకెళ్తున్న తనేలి బస్సు టైరు అకస్మాత్తుగా పగిలిపోవడంతో అదుపుతప్పి రోడ్డుపక్కనున్న గోడను బస్సు ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పలువురు కార్మికులు ప్రయాణిస్తుండగా, అదృష్టవశాత్తూ వారికి ఎలాంటి గాయాలు కాలేదు.బస్సు డ్రైవర్‌ కు తీవ్ర గాయాలు తగలడంతో అపస్మారిక స్థితిలో స్థితిలోకి వెళ్ళాడు.టైరు పేలిపోవడంతోనే బస్సు అదుపుతప్పి గోడను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనతో కార్మికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగకపోవడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.ప్రమాదం అనంతరం తడ ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.వాహనాల నిర్వహణలో యాజమాన్యాలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here