పసుపు రంగులో కళకళలాడే మహానాడు వేడుకను జయప్రదం చేయండి

0
14

📰 Generate e-Paper Clip

క్లస్టర్ ఇంచార్జ్ కర్యావుల శ్రీనివాసులు యాదవ్.

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):   

తెలుగు ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రతిబింబించే తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మహానాడు-2026” కు తరలిరావాలని క్లస్టర్ ఇంచార్జ్ కర్యావుల శ్రీనివాసులు యాదవ్ కోరుతున్నారు.మండల కేంద్రం మర్రిపాడు నెల్లూరు రోడ్డు లో బాబా గార్డెన్ వేదికగా డిజిటల్ మరియు ప్రత్యక్ష రూపాల కలయికలో జరుగుతున్న ఈ క్లస్టర్ స్థాయి వేడుకల్లో ప్రతి కార్యకర్త, అభిమాని ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఏఎంసి చైర్మన్ జనార్దన్ నాయుడు,సీనియర్ నాయకులు నారాయణ, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి ఏపీఐడిసిఎల్, మాజీ ఎంపిపి డైరెక్టర్ కటారి రమణయ్య, క్లస్టర్ ఇంచార్జ్ కర్యావుల శ్రీనివాసులు యాదవ్, పిలుపునిచ్చారు.విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 27-28 తేదీలలో ఎన్టీఆర్జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడంఆనవాయితీ. ఆ వేదికపై పార్టీ సిద్ధాంతాలుపునరుద్ఘాటిస్తారు. రాజకీయ తీర్మానాలుఆమోదిస్తారు. ప్రజా సమస్యలపై కార్యాచరణప్రకటిస్తారు. భవిష్యత్ ఎన్నికల వ్యూహాలను ఖరారుచేస్తారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, నేటి యువనేత లోకేష్ వరకు ఒక సిద్ధాంత యాత్రకు తరలి రావాలని వారు కోరుతున్నారు.మహానాడుఅనేది సాధారణ రాజకీయ సమావేశం కాదు. అదిపార్టీకి చెందిన ఒక భావోద్వేగోత్సవం. ప్రజాస్వామ్యవిలువలను కాపాడుతూ, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన కీలక తీర్మానాలను ఆమోదించే వేదిక. నిజమైన అర్థంలో టీడీపీకి మహానాడు ఒక పాలసీ పార్లమెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడే ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంది. రాబోయే కాలానికి పార్టీ అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలకు తుది రూపం లభిస్తుంది. సాధారణ కార్యకర్తలు కూడా తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం కల్పించే వేదిక అని కొనియాడారు.ప్రతి మహానాడులో ఆమోదించేకేవలం తెలుగుదేశం పార్టీ వార్షిక కాకుండా, ఒక ప్రజా పార్లమెంట్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటినుండి మహానాడు పార్టీకి దిక్సూచిగా నిలుస్తోంది. పసుపు రంగులో కళకళలాడే మహానాడు వేడుకను పార్టీ శ్రేణులు ప్రేమగాపసుపు పండుగగా పిలుస్తారు. పసుపు రంగు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రతీక. ఈ రంగుఆశ, అభివృద్ధి, సాంప్రదాయం, రైతు సంస్కృతిఅనే భావనను ప్రతిబింబిస్తుంది. మహానాడుఅనేది సాధారణ రాజకీయ సమావేశం కాదు. అదిపార్టీకి చెందిన ఒక భావోద్వేగోత్సవం. ప్రజాస్వామ్యవిలువలను కాపాడుతూ, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన కీలక తీర్మానాలను ఆమోదించే వేదిక. నిజమైన అర్థంలో టీడీపీకి మహానాడు ఒక పాలసీ పార్లమెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడే ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుంది. రాబోయే కాలానికి పార్టీ అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలకు తుది రూపం లభిస్తుంది. సాధారణ కార్యకర్తలు కూడా తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం కల్పించే వేదిక అని కొనియాడారు.ప్రగతికిబాటలు వేసిన ఎన్నో నిర్ణయాలు మహానాడు వేదిక నుంచే వెలువడ్డాయి. ఎన్టీఆర్ కలలు- చంద్రబాబు విజన్ ఇప్పుడు యువనేత నారా లోకేష్ కొత్త ఆశయాలతో ముందుకు వస్తున్న తరుణంలోమహానాడు మరింత కొత్త బలాన్నిసంతరించుకుంటోంది. మహానాడు వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడం అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయిగా, భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే పరిణామంగా చూడాలి. మూడుతరాల రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా లోకేష్ పాత్ర అత్యంత కీలకం కానుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో లోకేష్ పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, క్రియాశీలక కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడం ఆయన ప్రధానబాధ్యత కానుంది. పార్టీ యంత్రాంగాన్ని ఆధునికసాంకేతికతతో అనుసంధానించడం, బూత్ స్థాయి కమిటీల నుంచి రాష్ట్రస్థాయి వరకు సమన్వయాన్ని పర్యవేక్షించడంలో ఆయనది కీలక పాత్ర పోసిస్తారని నాడు ఎన్టీఆర్ వేసిన పునాది నుంచి నేడు లోకేష్ చూపిస్తున్న చొరవ వరకు కాలానికి అనుగుణంగా మారుతూ, ప్రజా పక్షాన నిలబడటమే మహానాడు లక్ష్యం అని ప్రతి ఒక్కఅభిమాని ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఏఎంసి చైర్మన్ జనార్దన్ నాయుడు,సీనియర్ నాయకులు నారాయణ, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి ఏపీఐడిసిఎల్, మాజీ ఎంపిపి డైరెక్టర్ కటారి రమణయ్య, క్లస్టర్ ఇంచార్జ్ కర్యావుల శ్రీనివాసులు యాదవ్ ఆహ్వానిస్తున్నారు

Leave a reply

Please enter your comment!
Please enter your name here