ఈ రోజు సాయంత్రం లోపల జిల్లాకు 47 లోడ్ల డీజిల్

0
10

📰 Generate e-Paper Clip

జిల్లా కు 148 లోడ్ల డీజిల్ మంజూరు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు. జిల్లాలో డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి. ప్రజలు బయాందోళనలు చెందవద్దు….. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.

 జిల్లాలో డీజిల్ నిల్వలు సమృద్దిగా ఉన్నాయని, ఈ విషయమై ప్రజలు బయాందోళనలు చెందవద్దు అని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా విజ్ఞప్తి చేసారు. సోమవారం జిల్లాలో డీజిల్ నిల్వలపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 271 డీజిల్ అవుట్ లెట్లు ఉన్నాయని, వాటిలో 40 షాపులలో కొంత తక్కువనిల్వలు ఉన్నాయన్నారు. ప్రముఖ ఆయిల్ కంపినీలు అయిన ఐ.ఒ.సి.యల్, బి.పి.సి.యల్, అరియు హెచ్.పి.సి.యల్ యాజమాన్యాలవారితో చర్చించడం జరిగిందన్నారు. జిల్లాకు 148 లోడ్ల డీజిల్ మంజూరు కాగా ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు 47 లోడ్ల డీజిల్ జిల్లాకు చ్చేరుకొంతుందని అన్నారు. రవాణా విషయములో జాప్య నివారణకై జిల్లా యస్.పి తో చర్చించడం జరిగిందని తెలిపారు. జిల్లాకు ముఖ్యంగా 3 ప్రాంతాలు నుండి అనగా కృష్ణ పట్నం పోర్టు, కడప మరియు చిత్తూరు నుండి డీజిల్ అందుతుంది అని అన్నారు. ఈ విషయమై ప్రజాలు బయాదోళనలు చెందవద్దని, జిల్లా సమృద్ధిగా నిల్వలు ఉన్నాయన్నారు. డిజిల్ ఆయిల్ నల్ల బజారు లో అమ్మినా లేదా నిబందనలు పాటించని వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయాన తెలిపారు.వారి సాగు, రొయ్యల సాగుకు సరిపడా డీజిల్ అందించడం జరుగుతుందని దాని కొరకై ప్రతి షాపు దగ్గర ఒక వి.ఆర్.ఓ మరియు హోం గార్డును తగు ఆధార్ కార్డులు పరిశీలనకై ఉంచడం జరిగిందని తెలిపారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here