పల్లె నిద్రతో ప్రజలకు మరింత భరోసా : సిఐ 

0
39

📰 Generate e-Paper Clip

యాకర్లపాడు లో గ్రామసభ నిర్వహించిన…. సీఐ గంగాధరం , ఎస్సైలు:                                          ఆత్మకూరు //అనంతసాగరం.(ఇదినిజం ప్రతినిధి ) గ్రామాల్లో పోలీసులు నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమంతో ప్రజలకు పోలీసులు పట్ల మరింత భరోసా కల్పిస్తున్నామని నేర రహిత సమాజం మరియు ప్రజలతో మమేకం అవ్వడం లక్ష్యమని సీఐ గంగాధరం తెలిపారు. మంగళవారంరాత్రి అనంతసాగరం మండలం సోమశిల పోలీసుస్టేషన్ పరిధిలో సీఐ గంగాధర్,ఆధ్వర్యంలోయాకర్లపాడు గ్రామంలో అనంతసాగరం, సోమశిల ఎస్సైలు సూర్య ప్రకాష్ రెడ్డి, అనూష లు,కానిస్టేబుళ్ళు పాల్గొని , ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా సిఐ గంగాధరం మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్ మరింత బలోపేతం చేయడమే పల్లె నిద్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద నేరాలుగాను, శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశముందని, ఇలాంటి అంశాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, చర్యలు చేపడు తున్నామన్నారు. పోలీసు స్టేషన్లుకు వెళ్ళకుండానే వారి సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు తెలిపేందుకు ‘పల్లెనిద్ర’ ఒక వేదికగా నిలుస్తుంద న్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విషయాలను, గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల మధ్యగల విభేదాలను, భూతగాదాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు, ప్రజలకు రక్షణగా నిలిచే చట్టాలు, సైబరు మోసాలు, మహిళలు, రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.యాకర్లపాడు హైవే వద్ద నాలుగు రోడ్లు కలిసే జంక్షన్ లో దాతల సహకారంతో టవర్ లైటింగ్ ఏర్పాటు చేశారు.. గతంలో ఈ ప్రాంతంలో చీకటిగా ఉండి ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో సీఐ గంగాధర్ ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామస్తుల సహకారంతో లైటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు..

Leave a reply

Please enter your comment!
Please enter your name here