*ఇంటర్ ఫలితాల్లో మర్రిపాడు కేజీబీవీ విద్యార్థినుల అద్భుత ప్రతిభ….*. మర్రిపాడు.(👉ఇదినిజం ప్రతినిధి ✍️):*బుధవారం వెలువడిన ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలలో మర్రిపాడు మండలంలోని కేజీబీవీ కళాశాల విద్యార్థినులు ప్రైవేట్ కళాశాలలకు దీటుగా రాణించారు. విద్యార్థినుల ఉత్తమ ఫలితాలు సాధించడంలో ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి, ఉపాధ్యాయునిల క్రమశిక్షణ నిబద్ధత కృషి అద్భుతం అని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలలో 32 మంది హాజరు కాగా 31 మంది పాస్ కాగా ఒకరు ఫెయిల్ కావడంతో 96.8% ఉత్తీర్ణత సాధించారు స్వాతి 485/500 మార్కులతో మొదటి స్థానం రాగ, ఎం .శ్రీలక్ష్మి 478/500, సిహెచ్ మేఘన 476/500 ద్వితీయ తృతీయ శ్రేణిలో నిలిచారు. సీనియర్ ఇంటర్ లో మొత్తం 32 మంది విద్యార్థినిలు హాజరుకాగ 100% ఉత్తీర్ణత సాధించారు కె .దీక్ష 974/1000 టాపర్ గా నిలవగా వి. రేనుమతి 964/1000,జి .సురేఖ 957/1000. ద్వితీయ తృతీయ శ్రేణి సాధించారు. మంచి మార్కులతో సత్తా చాటిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపాల్ లక్ష్మి దేవి, తల్లిదండ్రులు,ఉపాధ్యాయునిలు, అభినందించారు.





