* దుత్తలూరు బిజెపి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి అందే రామయ్య అధ్యక్షతన జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ ఘనంగా జరుపుకోవడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షురాలు శివపార్వతి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడని ఆయన కొనియాడారు. మేకపాటి మాల్యాద్రి నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.బిజెపి నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు చుండి హరిగోపాల్ రెడ్డి మాట్లాడుతూడాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అందే రామయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.ఈ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ, కార్యకర్తలు అభిమానులుపాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు
0
14
Previous article
- Advertisment -ads

