ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో స్టేట్ టాపర్ పడమటి నాయుడు పల్లి విద్యార్థి……*

0
12

📰 Generate e-Paper Clip

*ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో స్టేట్ టాపర్ పడమటి నాయుడు పల్లి విద్యార్థి……*.                                                   వంకెల చేతన్ శ్రీధర్ రెడ్డి:(HL: 2618119770):*. మర్రిపాడు.(👉ఇదినిజం ప్రతినిధి✍️ ):*

ఏపీ లో 2026 విద్యా సంవత్సరం బుధవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో నెల్లూరు విశ్వ సాయి జూనియర్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్న వంకెల చేతన్ శ్రీధర్ రెడ్డి ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 470 మార్కులు గాను 468 మార్కులు సాధించి స్టేట్ టాపర్ గా నిలవడం పడమటి నాయుడు పల్లి గ్రామానికి గర్వకారణం అని వాట్సాప్ వేదికగా పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చేతన్ శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులను అభినందిస్తున్నారు చేతన్ రెడ్డి తండ్రి శేఖర్ రెడ్డి చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడి చదివించి, తమ పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని, మంచి భవిష్యత్తును పొందాలని ఆశించాడు .ఈ శ్రమను గుర్తించి, కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించి వారి పోషణకు, త్యాగానికి సరైన కృతజ్ఞత అందించిన చేతన్ శ్రీధర్ రెడ్డి ఇష్టంగా, దీక్షతో చదివి ఇంటర్ మొదటి సంవత్సరం ఉత్తమ ఫలితం సాధించి స్టేట్ టాపర్ గా నిలవడం అభినందించదగిన విషయం అని పడమటి నాయుడు పల్లి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here