క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటా……*

0
37

📰 Generate e-Paper Clip

*బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గా…..నూనె హాజరత్ యాదవ్…..* *క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటా……*

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):*నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీ రెడ్డి,

బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ రెడ్డి శనివారం నూతన జిల్లా కమిటీ ప్రకటించిగా మర్రిపాడు మండలం నందవరం గ్రామానికి చెందిన నూనె హాజరత్ యాదవ్ బీజేవైఎం (భారతీయ జనతా యువమోర్చా) జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.బిజెపికి హాజరత్ యాదవ్ చేస్తున్న సేవలను పార్టీ గుర్తించిందని మండలం లోని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్బంగా హాజరత్ యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన బిజెపి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర జిల్లా,బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. బీజేపీ సిద్ధాంతం ఆదర్శాలకు పునరంకితమై క్రమశిక్షణ కార్యకర్తగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని పటిష్టంగా అన్ని వర్గాల్లో విస్తరించడానికి మా వంతు కృషి చేస్తానని తెలియజేసారు.జిల్లాలో బిజెపి పటిష్టతకు,అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా పని చేసి అనేకులను పార్టీలోకి ఆకర్షితులను చేయిస్తానన్నారు.బీజేపీ పెద్దల నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. సమష్టిగా పనిచేసి జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను ఎంపీటీసీలుగా, సర్పంచ్‌లుగా

గెలుపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు.తనకు జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశము కల్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీ రెడ్డి కి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ రెడ్డి కి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

 

 

 

Leave a reply

Please enter your comment!
Please enter your name here