పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

0
37

📰 Generate e-Paper Clip



చుంచులూరు ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు గ్రామానికి చెందిన దువ్వూరు సురేష్ కుమార్ పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.అనంతరం సరస్వతి పూజ సందర్భంగా విద్యార్థులకు రుచికరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలనే తలంపుతో సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని,అందులో భాగంగా విద్యార్థులకు దాతల చేతుల మీదుగా పరీక్ష సామాగ్రిని పంపిణీ చేయడం జరిగిందని,అలాగే దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో చుంచులూరు మాజీ సర్పంచ్ దువ్వూరు జయదేవ్,విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి జొన్నా సత్యనారాయణ,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కలిశెట్టి వెంకట రమణయ్య,ఇరుకుమాటి మురళీధర్ రావు,వేమన విజయరాఘవులు,వేమన చెంచు నారాయణ,తంగేడుపల్లి సుబ్బయ్య,ఉపాధ్యాయులు,విద్యార్థులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here