విలువలు, విశ్వసనీయతకు మారుపేరు వైయస్సార్‌సీపి….
మండల కన్వీనర్ చెన్ను. వెంకటేశ్వర్లు రెడ్డి.
మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి ):
రాష్ట్రంలోనే కాదు.దేశ రాజకీయాల్లోనూ ప్రబలమైన పార్టీ,కోట్లాది మంది అభిమానులు గుండెలో పెట్టుకున్న ప్రతి ఒక్కరిది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని మర్రిపాడు మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి.కొనియాడారు.
మండల కేంద్రం మర్రిపాడు వైసిపీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైసీపీ మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి, మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, వైఎస్సార్ ఆశయాలను స్మరించుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మర్రిపాడు మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డివైయస్సార్‌సీపీపై కాంగ్రెస్, టీడీపీ కుట్రలు, కుతంత్రాలు కానీ, జగన్ ఏనాడూ భయపడలేదు. వెనక్కి తగ్గలేదు
జగన్ నమ్ముకుంది పైన ఉన్న దేవుడిది. కింద ఉన్న మిమ్మల్ని కార్యకర్తలును ఆ దేవుడి ఆశీస్సులు, మీ అభిమానంతో గట్టిగా నిలబడ్డారు.విలువలు, విశ్వసనీయతకు మన పార్టీ కట్టుబడి ఉంటుందని
గత 16 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పార్టీ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతోందని తెలిపారు. పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన నిలబడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందిస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

