*వైద్యుడుగా మి సేవలు అమోఘం…*

0
15

📰 Generate e-Paper Clip

మర్రిపాడు మండల మెడికల్ ఆఫీసర్, ప్రజా వైద్యులు డా. ఏ. గోపినాథ్ కు మర్రిపాడు ప్రజలు అందరి తరుపున శుభాకాంక్షలు…

(*👉ప్రభాకర్ మేకల /,👉/ఇదినిజం బ్యూరో ఇంచార్జ్✍️.*)

నేడు జాతీయ వైద్యుల దినోత్సవంసందర్భంగా మర్రిపాడు మండల మెడికల్ ఆఫీసర్, ప్రజా వైద్యులు డా. ఏ. గోపినాథ్ కు మర్రిపాడు ప్రజలు అందరి తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.మండల కేంద్రంలో ప్రాథమిక వైద్యాశాలలో మీరు బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి అనారోగ్యం తో ఆసుపత్రుకి వచ్చే పేద ప్రజలపై మీరు చూపే అసమానమైన అంకితభావం, కరుణతో జీవితాలను రక్షించడానికి చేస్తున్న అవిశ్రాంత ప్రయత్నాలకు మేము వందనం చేస్తున్నాం.ఆరోగ్యపరమైన సమస్యలతో వచ్చేవారికి మెరుగైన వైద్యం అందించి, స్వస్థత కలిగించేందుకు వైద్యుడుగా మి తపన అమోఘం క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో ఉన్న రోగులకు సైతం పునర్జన్మ ఇచ్చేందుకు ఆసుపత్రి బల్లపై చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు….”పోలయ్య ప్రాణాలను కాపాడటమే ఇందుకు నిదర్శం” అర్ద రాత్రి వెళ చిలకపాడు కొక్కంటి పోలయ్య గుండె నొప్పితో బాధపడుతూ శ్వాస తీసుకోలేక మీదగ్గరికి వస్తే ప్రాథమిక వైద్యం అందించి పరిస్థితిని అవగాహన చేసుకొని ఆయన ప్రాణాలను కాపాడాలనే సంకల్పం తో అపరాత్రి వేళ నెల్లూరు కి కారులో వెళ్లి మీరే దగ్గర ఉండి రాత్రంతా శ్రమపడి పోలన్నకు ప్రాణవాయువు నింపావు జీవితాన్ని నిలబెట్టావు మీరు అందిస్తున్నసేవలు అమూల్యమైనవి కొనియాడదగినవని *”నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా”* మి సేవలు గుర్తు చేసుకుంటున్నాము.

Leave a reply

Please enter your comment!
Please enter your name here