మర్రిపాడు ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు మనబడి.. జ్ఞాన బాట’ ర్యాలీ….*

0
8

📰 Generate e-Paper Clip

*మర్రిపాడు ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు మనబడి.. జ్ఞాన బాట’ ర్యాలీ….*

మర్రిపాడు.(👉ఇదినిజం ప్రతినిధి ✍️):*.             మర్రిపాడు మండలంలోని స్థానిక ఎస్సి కాలనీ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.సుధాకర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు జి ప్రసాద్, అనితకుమారి, విజయలక్ష్మి లు పాల్గొని2026-27 విద్యా సంవత్సరానికి గాను నూతన విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తూ ‘మనబడి..జ్ఞాన బాట’ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల పరిధిలోని ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి ప్రతి చిన్నారిని ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని నిపుణులైన ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ప్రధానోపాధ్యాయులుకె.సుధాకర్,ఉపాధ్యాయులు జి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు మంచి పునాదిని వేస్తాయన్నారు.పాఠశాలలో అత్యాధునిక వసతులు, నాణ్యమైన బోధన అందుబాటులో ఉన్నాయని, 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను స్థానిక ఎస్సి కాలనీ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here