ఎమ్మార్వో, ఎంపీడీవోను కలిసిన మండల అధ్యక్షులు నీరుకట్టు శ్రీహరి.
అనంతసాగరం(ఇదినిజం ప్రతినిధి ):
అనంతసాగరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మండల ఎమ్మార్వో వసంత రాయలును, మండల ఎంపీడీవో హైజాక్ ప్రవీణ్ ను ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షులు నీరుకట్టు శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మార్వోను, ఎంపీడీవో గారిని శాలువాతో సత్కరించి, మండలంలో దళితుల సమస్యలు, అట్రాసిటీ చట్ట అమలుపై చర్చించారు. ప్రతి నెల చివరి తేదీన జరిగే ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో పౌర హక్కులదినోత్సవంగ్రామసభలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలని కోరారు
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ మేము పెంచలయ్య, ప్రజా గాయకులు కాలువ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.





