డ్రాయింగ్ మాస్టర్ తోట కిషోర్ కుమార్ కుంచె కదిపితే అద్భుత ‘చిత్ర’మే:
మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):
ప్రకృతి అందాలను సరికొత్తగా చూపించేది చిత్రకళే. మనసును ఆనందపర్చేలా, జీవకళ ఉట్టిపడేలా కనువిందు చేసే అద్భుత చిత్రకళ మాస్టారుకి వెన్నతో పెట్టిన విద్య.ఆ చేతి కుంచె పడితే సప్తవర్ణ శోభితమే. ఆయనే చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ మాస్టర్ తోట కిషోర్ కుమార్. ఆర్ట్/డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తు తన కుంచెతో ప్రపంచం మెచ్చే చిత్రాలను ఆవిష్కరిస్తూ పర్యావరణాన్ని, మానవాళి జీవన శైలిని పల్లె జీవితాన్ని ఆవశ్యకతను రూపొందిస్తూ తన కుంచె నుంచి జాలువారిన చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రఖ్యాత చిత్రకారుడు (ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్)గా పేరు తెచ్చుకున్నారు.పల్లె జీవిన విధానాన్ని ప్రతిభింబిస్తూ అపరాత్రి వేల పండు వెన్నెలలో లాంతరు వెలుతురుతో గుమ్మం నుంచి అడుగు బయట పెట్టిన పడుచుమాధుర్యాన్నికుంచెకుపదునుపెట్టిమనోప్రపంచంలో ఉన్న ఆమె రూపాన్ని వీక్షిస్తే కళ్లముందు కదలాడేది ప్రకృతి రూపమే. అలా ప్రకృతి రమణీయతను, పడుచుదనాన్ని ఒకే చోట కలగలిపి తీర్చిదిద్దితే ఆ కళను వర్ణించేందుకు మాటలు చాలని ఈ అద్భుత చిత్రానికి సురోభారతి కళా కేంద్రం, కోల్‌కతా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన ఆల్ ఇండియా టాలెంట్ సర్చ్ పోస్టల్ పోటీల్లో డ్రాయింగ్ మాస్టర్, అంతర్జాతీయ కళాకారుడు తోట కిషోర్ కుమార్ కు గోల్డ్ మెడల్ వరించింది.మే 15 నుంచి నిర్వహించిన ఈ పోటీలకు మే 30లోపు అందిన పెయింటింగ్స్‌ను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు. స్కూల్‌లో డ్రాయింగ్ టీచర్‌గా పనిచేస్తూ, విద్యార్థుల్లో చిత్రకళ పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే కళలో రాటుదేలిన ఆయన, అద్భుత చిత్రాలకు జీవం పోయటం ద్వారా ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని బహుమతులు పొందారు. అద్భుతమైన కళా ప్రతిభనుచాటుతూఅందరిచేతశభాష్‌అనిపించుకుంటున్నారు.సమాజహితం కోరుతూ ఆత్మ సంతృప్తి కోసమే కాకుండా సమాజానికి ఉపయోగపడాలనే తృష్ణతో అనేక సామాజిక అంశాలపై కళాఖండాలను రూపొందిస్తున్నారు ప్రకృతి, పర్యావరణం, పల్లె జీవన విధానం బాలల హక్కులు, మహిళా స్వేచ్ఛ వంటి విభిన్న అంశాలపై ఆయన గీచిన చిత్రాలు ఆలోచింపజేస్తున్నాయి. ఏ చిత్రం గీచినా సరికొత్తగా జీవితాంతం గుర్తుపెట్టుకునేలా తీర్చిదిద్దటం ఆయన ప్రత్యేకత. విరామం దొరికితే చాలు బొమ్మలు వేస్తూ గడిపే కిషోర్ మాస్టారు, ఆ అలవాటే నిత్యం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను, శాస్త్రీయ దృక్పథాన్ని, కళలను వెలికి తీసేందుకు వినూత్న పద్ధతిలో బోధన చేస్తు విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంచుతున్నారు.ఆల్ ఇండియా టాలెంట్ సర్చ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన చేజర్ల డ్రాయింగ్ మాస్టర్ కు కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.

