బడి పిల్లలకు బస్సు లేదంటే ఎట్లా….?*

0
8

📰 Generate e-Paper Clip

బడి పిల్లలకు బస్సు లేదంటే ఎట్లా….?

మోడల్ స్కూల్ కు రెండు బస్సులు కట్..?

నేడు పాఠశాలలు పునః ప్రారంభం…..!

బస్సు ఉంటేనే బడికి… లేదంటే ఇంటికే :

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్):

మర్రిపాడు మండలంలో నందవరం మోడల్ స్కూల్ 600మంది విద్యార్థులతో ఉత్తమ విద్యా బుద్దులు అలవర్చుకుంటూ పేద పిల్లలకు విద్యా ప్రదాయనిగా కలకలలాడుతుంది.నియోజకవర్గ పరిధిలో చుట్టూ ప్రక్కల ఇక్కడ చదువుకొనే విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వ అధికారులు గత సంవత్సరం వరకు ఐదు ఆర్టీసీ బస్సులను కేటాయించారు.కాని ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు జూన్ 12 వతేది నేడు పునఃప్రారంభం కావలసి ఉండగా బస్సులు కొరత కారణంగా పాఠశాలకు సంబందించిన రెండు బస్సు సర్వీసులు (కదిరి నాయుడుపల్లి, మరియు ఇర్లపాడు రూట్ )నిలిపి వేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పాఠశాల ప్రిన్సిపాల్ కు తెలియజేసినట్లు సమాచారం.బస్సులు కొరతని విద్యార్థుల కోసం నడపాల్సిన సర్వీసులను తగ్గిస్తే విద్యార్థుల బంగారు భవితపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని బస్సు ఉంటేనే బడికి వెళ్ళగలరని లేకుంటే ఇంటికే పరిమితం కావల్సివస్తుందని తల్లి దండ్రులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండల కేంద్రాలు, పట్టణాల్లోని ఉన్నత పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వచ్చే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు అనేక అవస్థలు పడతారని ఫలితంగా వారి చదువులు కూడా అగమ్యగోచరమయ్యే పరిస్థితి కన్పిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు.విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రవాణా సౌకర్యం కోసం పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్టీసీ అధికారులకు విన్నవించుకున్న ఫలితం సూన్యమని తెలుస్తుంది.ఈ విషయం ఫై ఆర్టీసీ జిల్లా పెద్దలు పెద్ద మనస్సుతో అలోచించి పునః పరిశీలించి మర్రిపాడు మెట్ట ప్రాంత పేద విద్యార్థులకు రవాణా సౌకర్యం కొరకు బస్సులను కేటాయిస్తారని మండల వాసులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here