📰 Generate e-Paper Clip

మర్రిపాడు (ఇదినిజం ప్రతినిధి ): ni నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినేనిపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గ్రామానికి చెందిన రైతు మంచాల పెంచలయ్య తన డ్రాగన్ ఫ్రూట్ తోట వర్షం బీభత్సానికి గురై పంట పూర్తిగా దెబ్బతిన్నదని వాపోయారు. ఈ తోట కోసం భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ, ఒక్కసారిగా వచ్చిన వర్షం కారణంగా సుమారు లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.ఇంకా నెల రోజుల్లో పూతకు వచ్చే దశలో ఉన్న పంట ఈ విధంగా నాశనం కావడం తనకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తెచ్చిందని చెప్పారు. అంతేకాకుండా, పొలంలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు కూడా బలమైన గాలులకు తట్టుకోలేక పైకప్పు రేకులు ఎగిరిపోయి పాడైపోయాయని వివరించారు.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే స్పందించి తగిన పరిహారం అందించాలని రైతు పెంచలయ్య కోరుతున్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here