-పురిటి బిడ్డలకు జీవం పోస్తున్న ఆపద్బాంధవులు…
మర్రిపాడు.(ప్రభాకర్ మేకల ఇదినిజం బ్యూరో ఇంచార్జ్): నెల్లూరు ముంబై జాతీయ రహదారిలో జిల్లాకు చివరగా అంతర జిల్లా సరిహద్దుకు అనుకోని ఉన్న మండల కేంద్రం మర్రిపాడు లో 108 అంబులెన్స్ సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడుతూ, రవాణా సౌకర్యం లేని గ్రామీణ ప్రజలకు ఆపద్బాంధవులు గా మారారు. అత్యవసర సేవలు అందుస్తున్న ఈఎంటి. పణి కుమార్,.సురేంద్ర… పైలెట్. పి.వాసు.మస్తాన్ దైవకార్యంగా భావిస్తున్నారు. వైద్యో నారాయణో హరి అని పెద్దలు చెబుతుంటారు. వైద్యం చేసే డాక్టర్ దేవుడితో సమానం అని మన పూర్వీకులు ఎనాడో చెప్పారు. ప్రాణాలు కాపాడే చేతులను నమస్కరించమని, గౌరవించమని తరతరాలుగా చెబుతూనే వచ్చారు. కానీ నేటి కాలంలో వైద్యులకే సమానంగా విలువైన సేవలు అందిస్తున్న ఓ వర్గం ఉంది. ప్రాణాలకు తెగించి బాధితులకు సేవలు అందిస్తున్నారు వారు ఎవరంటే.. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడూ ముందుండే 108 అంబులెన్స్ సిబ్బంది. ఇవాళ ఆ అంబులెన్స్ సిబ్బంది సేవలు చూసిన ప్రజలు వారిని దేవుళ్లుగానే భావిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఎవరైనా ప్రమాదానికి గురైతే, గర్భిణీలకు అర్ధరాత్రి నొప్పులు వస్తే, రక్తస్రావం వల్ల పరిస్థితి విషమమైతే.. ప్రజలు తొలుత గుర్తు చేసుకునేది 108 నంబర్‌నే. ఒక కాల్ చేసిన వెంటనే ఆ సిబ్బంది రాత్రింబవళ్లు పరుగులు తీస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ఆసుపత్రి వరకు తీసుకెళ్లే సమయంలో ఆ వాహనంలోనే తాత్కాలిక వైద్యం చేయడం, ఎమర్జెన్సీ సపోర్ట్ అందించడం, అవసరమైతే డెలివరీలు నిర్వహించడం వీరి రోజువారీ పని అయిపోయింది.ఇటీవల జరిగిన ఘటనే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.మర్రి పాడు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రాధా(26) అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు స్థానిక 108 అంబులెన్స్ సేవలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు. అయితే మార్గమధ్యలో రాధాకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది పైలెట్ షేక్ మస్తాన్, టెక్నీషియన్ పనికుమార్ అప్రమత్తమై అంబులెన్స్ లోనే ప్రధమ చికిత్స అందిస్తూ సురక్షితంగా ప్రసవాన్ని నిర్వహించారు. దీంతో రాధా అంబులెన్స్ లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పురిటి బిడ్డకు తల్లి కి జీవం పోశారు ఆసుపత్రికి చేరడంతో వైద్యులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని చెప్పడంతో ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలుపుతూ .. మాకే కాదు, మా బిడ్డకే కొత్త జీవం ఇచ్చారు.. అని 108 సిబ్బందిని కొనియాడారు….. మండల కేంద్రానికి సమీపంలోజరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రక్కన పడిపోయి ఉంటే చూసేవారు సెల్ ఫోన్ ఫోటోలతో సరిపెట్టుకుంటే సాయం అందించే చేతులు లేకపోయినా 108 సిబ్బంది శ్రమించి వాహనం లోకి ఎక్కించి ఆత్మకూరు ఆసుపత్రికి చేర్పించి తమ విధిని నిర్వర్తించారు.సెట్టిసముద్రం సమీపంలో పొగాకు కూలీలు ట్రాక్టర్ బోల్తా పడితే చావు బ్రతుకుల మధ్య మహిళ ఉంటే కొస ప్రాణం తో నైనా కాపాడాలని ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రి చేరే వరకు వారు పడిన తపన వర్ణనాతీతం.అలా రోజూ వందల కిలోమీటర్లు తిరుగుతూ, పగలు రాత్రి తేడా లేకుండా కాల్స్‌కి స్పందిస్తూ, ప్రాణాలను కాపాడుతూ ఉండటం ఈ సేవలను ప్రజలు కేవలం ఉద్యోగంగా కాకుండా ఒక దైవకార్యంగా చూస్తున్నారు. గర్భిణీ స్త్రీలు సురక్షితంగా బిడ్డలకు జన్మనివ్వడమే కాదు, రోడ్డు ప్రమాదాల్లో రక్తస్రావం ఆపడం, గుండెపోటు బాధితులకు తక్షణ చికిత్స అందించడం వంటి అనేక అద్భుతాలు ఈ 108 వాహనంలోనే జరుగుతున్నాయి. నిజానికి వైద్యులు కాపాడే ప్రాణాలు ఒక వైపు ఉంటే, అత్యవసర సమయాల్లో మొదటి క్షణంలో అండగా నిలిచే వారు 108 సిబ్బందే” అని ప్రజలు చెబుతున్నారు. కష్టసమయంలో వారి ఆత్మవిశ్వాసమే రోగికి కొత్త ఆశనిస్తుంది. అందుకే 108 సేవకులను చూస్తే ఈఎంటి. పణి కుమార్,.సురేంద్ర పైలెట్. పి.వాసు.మస్తాన్ లను ప్రజలు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నారు.

