📰 Generate e-Paper Clip

బడి బాట” కార్యక్రమం లో ప్రజా ప్రతినిధులు భాగం కావాలి….?

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):                      

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదునుపెంచడానికి ప్రభుత్వం ఆదర్శవంతమైన కార్యక్రమం “బడి బాట’ కార్యక్రమం మొదలు పెట్టింది.విద్యార్థులను పాఠశాలలకు తీసుకురావడానికి, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయులు అంకితభావంతో కృషి చేస్తున్నారు. నిజానికి దీనిని ఒకకార్యక్రమంఅనరాదు.ఇదొక సామాజిక ఉద్యమం. సర్కారు విద్యావ్యవస్థను కాపాడి, అది బలపడేలా చేసేందుకు సాగుతున్న ఉద్యమం.బడి బాట కార్యక్రమం కేవలం విద్యార్థుల నమోదును పెంచడం మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో ఒకసానుకూల దృక్పథాన్ని పెంపొందించడంకోసం లక్ష్యంగా చేసుకుంది ప్రభుత్వం.ఐతే సర్కార్ బడుల సంరక్షణ టీచర్లదేనా? అనే సందేహం బుద్ది జీవులు సందేహం పాఠశాలలను రక్షించుకునే మహత్తరకార్యక్రమం లక్ష్యసాధన కేవలం ఉపాధ్యాయులకే వదిలేయకుండా ఒక సామాజిక కార్యక్రమంగా రూపొందాలి. ఈలక్ష్యాన్ని సాధించే బాధ్యత అందరి మీదఉండాలి.ప్రజాప్రతినిధులు కూడా సర్కారు బడులను కాపాడుకుని, వాటిపట్ల ప్రజల్లో గౌరవభావం కలిగేంచే ఉద్యమంలో కీలక పాత్ర పోశించాలి.ఈకార్యక్రమంలో టీచర్లు చాలాఅంకితభావంతో, వినూత్న వ్యూహాలతోపాల్గొంటున్నారు. ప్రజాప్రతినిధులు తమ పలుకుబడిని ఉపయోగించి గ్రామ పెద్దలు, మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వ సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయగలరు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా, ఒకసామాజిక ఉద్యమంగారూపుదిద్దుకోవడానికిసహాయపడుతుంది.ప్రభుత్వ పాఠశాలల పట్ల కొంతమంది తల్లిదండ్రుల్లో ఇంకా అపోహలు ఉండవచ్చు. ప్రజాప్రతినిధులు స్వయంగా గ్రామాలు,వాడల్లో పర్యటించి, తల్లిదండ్రులతోమాట్లాడటం వల్ల వారి సందేహాలు నివృత్తిఅవుతాయి. పాఠశాలల్లో నాణ్యమైన విద్యఅందుబాటులో ఉందని, తమ పిల్లలభవిష్యత్తుకు భరోసా ఉంటుందని వారునమ్మకం పొందగలరు. ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, ప్రభుత్వానికి చేరవేయగలరు. ఇది బడి బాట కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచడానికి, ప్రజలఅవసరాలకు అనుగుణంగా మార్పులుచేయడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది.బడి బాట కార్యక్రమం విజయం కేవలంఉపాధ్యాయుల కృషితోనే కాకుండా,ప్రజాప్రతినిధుల క్రియాశీల భాగస్వామ్యంతోమరింత పటిష్టం అవుతుంది. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసినప్పుడు, ప్రభుత్వ పాఠశాలలు విద్యకు కేంద్రాలుగా మారి,విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు ఇది సమాజం యొక్క విద్యా ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది అనడంలో సందేహం లేదనేది సామాజిక విశ్లేషకుల అభిప్రాయం.

Leave a reply

Please enter your comment!
Please enter your name here