40 డేస్ గోటూ విలేజ్ కార్యక్రమంతో ఉధ్యమాన్ని ఉదృతం చేద్దాం..పందిటి అంబేద్కర్ మాదిగ.

0
18

📰 Generate e-Paper Clip

40 డేస్ గోటూ విలేజ్ కార్యక్రమంతో ఉధ్యమాన్ని ఉదృతం చేద్దాం..పందిటి అంబేద్కర్ మాదిగ.  ఆత్మకూరు (ఇదినిజం ప్రతినిధి ):  నెల్లూరు జిల్లా ఆత్మకూరు టౌన్ లోని ఎస్సీ కాలనీలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో 40 డేస్ గో టు విలేజ్ కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పీఎస్ టౌన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ పొల్గొనిఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకుఎమ్మార్పీఎస్. ఎంఎస్పీనెల్లూరు జిల్లా ఇన్చార్జీ మంద వెంకటేశ్వరరావు మాదిగ సూచనల మేరకు గ్రామ గ్రామాన ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణలు జరగాలని,ఆత్మకూరు టౌన్ లో జెండా ఏర్పాటు చేయాలనిఅలాగే యువత చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని,విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణ ఫలాలు పూర్తిస్థాయిలో అందుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు.మాదిగలకు ఎలాంటి సమస్య వచ్చినా ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని, ఆత్మకూరు నియోజకవర్గం మాదిగలు ఎమ్మార్పీఎస్ లో గ్రామ స్థాయి నుండి ఎంఆర్పీఎస్-ఎంఎస్పీ కమిటీలలో భాగస్వాములు కావాలని మరో మారు ఎమ్మార్పీఎస్ ఉధ్యమాన్ని మరింత ఉదృతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలోఎంఎస్పీ సీనియర్ నాయకులు బొద్దకూరు మహేష్ మాదిగ,గడ్డం వంశీ కృష్ణ మాదిగఅనంతరం ఎమ్మార్పీఎస్ టౌన్ ఇన్చార్జులను నియమించడం జరిగిందని ఎమ్మార్పీఎస్ టౌన్ఇన్చార్జిగాఆత్మకూరువిజయ్మాదిగ,కోఇన్చార్జులుగా గంటా నాగేంద్ర మాదిగ గడ్డం సునీల్ మాదిగ పల్లవోలు శ్రీహరి మాదిగ, కొండా రాజశేఖర్ మాదిగ, గంగపట్ల రాంకీ మాదిగ, కొండా సాయి మాదిగ, శాగలమూరి చరణ్ మాదిగలను మాదిగ యువకులు విధ్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here