నూతన వధూవరులను ఆశీర్వదించిన కొప్పాల రఘు_
నెల్లూరు /దగదర్తి:(ఇదినిజం ప్రతినిధి ):నెల్లూరు జిల్లా దగదర్తి మండలానికి చెందిన యువ న్యాయవాది, సామాజిక కార్యకర్త ఇర్ల వెంకటరమణయ్య – లావణ్య నూతన వధూవరుల రిసెప్షన్ వేడుక వారి నివాసంలో ఆదివారం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పాల రఘు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా కొప్పాల రఘు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలోనే కాకుండా సామాజిక సేవలోనూ ముందుండే వెంకటరమణయ్య దంపతులు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా దీవించారు.కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, న్యాయవాదులు, బుచ్చిరెడ్డిపాలెం మండల కమిటీ కన్వీనర్ జ్యోతి పెంచలయ్య, యువ నాయకులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





