*💪నేరస్తులకుభయం – సామాన్యులకు భరోసా కల్పిస్తున్న…. సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధరం.*
*మర్రిపాడు.(👉ప్రభాకర్ మేకల /✍️/ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ✍️):*. నెల్లూరు నగరంలో గత కొంత కాలం క్రైం రేట్ గాడి తప్పుతున్న వేల సింహపురి ని సరిచేయడానికి వచ్చిన నాలుగో సింహం ఎస్పీ అజిత వేజండ్ల నిఘా నేరస్తుల గుండెల్లో సెగ పుట్టించింది. ఎస్పీ ఆదేశాలను ఆచరణలో చూపిస్తు ఆత్మకూరు డిఎస్పి వేణు గోపాల్ సారథ్యంలో ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధరం ఖాకీ కమాండింగ్ ని చూపిస్తున్నారు.మొన్నటి వరకూ రోడ్లపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనదారులకు చుక్కలు చూపించారు.ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 40 మంది పోలీసులు తో మూడు రోజుల క్రితం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరుపాలెం ముస్లిం కాలనీలో సిఐ కార్డన్ సెర్చ్ నిర్వహించి గల్లీల్లో నేరగాళ్ల చిరునామాలు గాలిస్తున్నారు!ప్రతి ఇంటిని పరిశీలించి ఇక్కడ నివసించెవారి వివరాలు తెలుసుకుంటూ క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సరైన పత్రాలతో వాహనాలు కలిగి ఉండాలని,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా కొత్త వ్యక్తుల సంచారం పై పర్యవేక్షణ చేయాలంటూ ఒక ప్రక్క నేరస్తులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూ ఖాకీ కమాండింగ్ ని చూపించారు . మరోవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ కి అవగాహన కల్పిస్తూ అదర్శంగా నిలుస్తున్నారు .
నెల్లూరు పాలెం లో జరిగిన తనిఖీ లో సరైన పత్రాలు లేని 50 స్కూటర్లు, మూడు కార్లు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు..
ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన క్షణంనుండే తన ‘నిఘా’ నేత్రం తో అటు నేరస్తులకు భయం, ఇటు సామాన్యులకు భరోసా
కల్పిస్తున్నారు. చట్టం ఎంత కఠినంగా ఉంటుందో వారికి కళ్లకు కట్టినట్లు వివరించారు. ఒకవైపు లా అండ్ ఆర్డర్.. మరోవైపు ప్రాణ రక్షణ! కేవలం నేరగాళ్లను పట్టుకోవడమే కాదు, ప్రజల ప్రాణాల రక్షణే పరమావధిగా సీఐ గంగాధరం దూసుకుపోతున్నారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని కోరుతూ తనదైన శైలిలో సిబ్బంది తో పోలీసింగ్ నిర్వహిస్తూ . అటు నేరగాళ్లకు సింహస్వప్నంలా, ఇటు ప్రజలప్రాణాలను కాపాడే ఆపద్బాంధవుడిలా సీఐ గంగాధరం చూపిస్తున్న చొరవపై ఆత్మకూరు సర్కిల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





