ఆర్డీఓ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ….

0
24

📰 Generate e-Paper Clip

ఆర్డీఓ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ….

కార్యక్రమం లో పాల్గొన్న డి.ఎస్.పి, వివిధ శాఖల అధికారులు.                                         

ఆత్మకూరు.(ఇదినిజం ప్రతినిధి ):

రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం లో రెవిన్యూ డివిజనల్ అధికారి పావని ఆధ్వర్యంలో రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో రెవెన్యూ, పోలీస్, విద్యుత్తు, ఫారెస్ట్, ఫైర్, విపత్తుల నిర్వహణ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నివారించే క్రమం లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న భద్రత పరమైన అంశాలపై మరింతగా దృష్టి సారించాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో రోడ్లపై గేదలు, ఆవులు సంచారం ఎక్కువగా ఉండటం,నిద్రమత్తు కారణంగానే అధిక ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారుల గుర్తించారు.నివారణ చర్యలపై చర్చించారు.భవిష్యత్‌లో అటువంటి ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదే శించారు. ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అం దుకు జాయింట్‌ కమిటీ ఆధ్వర్యం లో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని స్పష్టం చేశారు. రహదారులు నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టే సందర్భంలో స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసిజర్‌కు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రమాద స్థలాలను గుర్తించి సూచికలు, తగిన డైవర్షన్‌లు పెట్టడం, వేగ నియంత్రణ కోసం బోర్డులు ప్రదర్శన చేయాలన్నారు. జాతీ య రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగకుండా తగిన లైటింగ్‌ వ్యవస్థ, బ్లింకర్స్‌ ఏర్పా టు చేసి చోదకులను అప్రమత్తం చేయడం ముఖ్యమన్నారు. సైన్‌బోర్డులతో పాటు డైవర్షన్‌ పెట్టడం వలన వేగ నియంత్రణ ప్రమాధనివారణ సాధ్యమౌతుందన్నారు.సి ఐ మాట్లాడు సర్కిల్ పరిధిలో కొన్ని అత్యంత ప్రమాదాలు జరిగే ప్రదేసాలు గుర్తించామన్నారు. హైవే ఫై జరిగిన ప్రతీ ప్రమాద ఘటనపై శాఖల వారీగా విశ్లేషణ చేయాల్సి ఉంటుందన్నారు. అప్పుడే భవిష్యత్తులో అటువంటి ప్రమాదాలు నివారించేందుకు చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో డీఎస్పీ కే వేణుగోపాల్, సీఐ గంగాధరం, మండల తాసిల్దారులు జిల్లా రవాణాధికారి వైద్య ఆరోగ్యశాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here