అక్రమ పట్టాలు సృష్టించి పొలంలో చెట్లు తీస్తున్నారని గ్రామస్తులు పిర్యాదు…..

0
9

📰 Generate e-Paper Clip

అక్రమ పట్టాలు సృష్టించి పొలంలో చెట్లు తీస్తున్నారని గ్రామస్తులు పిర్యాదు…..

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల /ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):

మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామంలో 205 సర్వే నంబరు గల సుమారు 10ఎకరాల పొలం రైతుల పశువుల మేతకోసం ఇతర అవసరాల నిమిత్తం ఉపయోగించుకుంటున్న భూమి దశాబ్ధాల తరబడి ప్రభుత్వ భూమి గానే రికార్డులలో నమోదై ఉంది. గ్రామాల ప్రజల రైతుల అవసరాలు తీరుస్తున్న ప్రభుత్వ భూమిని కొందరుఇతర గ్రామస్తులు రికార్డులను మార్చి తమ పేర్లు రాయించుకుని అక్రమంగా పట్టా చేయించుకుని పొలంలో చెట్లు పీకి చదును చేస్తున్నారని గ్రామస్తులు కొందరితో కలిసి ఈదల కొండయ్య మర్రిపాడు మండల తహసీల్దార్ కు అర్జీ సమర్పించి పిర్యాదు చేశారు. తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్ఐ, వీఆర్వో క్షేత్ర స్థాయిలో పరిశీలించి 205 సర్వే నంబర్ గల పొలంలో సుమారు 5ఎకరాలు పొలంలో చెట్లు తీసినట్లు తహసీల్దార్ కు తెలియజేశారు డైక్లెట్ ప్రకారం సర్వే నంబర్లో గుంట గా నమోదు కాబడిన పొలం పట్టా ఇచ్చి ఉన్నా రద్దు చేయబడుతుందని తెలియజేసారు. .పట్టా ఎలా చేయడం జరిగిందో రికార్డులు పరిశీలిస్తామని . అక్రమంగా పట్టా చేసుకున్నట్లుగా తేలితే వాటిని రద్దు చేయడానికి సిఫారసు చేస్తామని అలాంటి పొలంలో అనుమతి లేకుండా ప్రవేశిస్తే చట్ట పరమైన చర్యలు ఉంటాయని తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ తెలియజేసారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here