LPG గ్యాస్ కొరత ఉందని కొందరు దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు నిజం కాదు… మేకపాటి. మాల్యాద్రి బిజెపి కిసాన్ మోర్చా నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ కొరత ఎక్కడా లేదు కానీ కొంతమంది ముందుజాగ్రత్త పేరుతో 25 రోజులు పూర్తికాకముందే పదేపదే బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే కొన్ని బుకింగ్స్ స్వీకరించబడటం లేదు. ఒకేసారి ఎక్కువగా బుకింగ్స్ మరియు కంప్లైంట్స్ రావడం వల్ల కొన్నిసార్లు సర్వర్ కూడాడౌన్ అవుతుందని ప్రజలకు తెలియజేద్దాం..భారత్ గ్యాస్‌లో సిలిండర్లు, ఇండియన్ గ్యాస్ గోడౌన్‌లో కూడా సుమారు సిలిండర్లు స్టాక్‌లో ఉన్నాయి. ఎవరు ముందుగా బుక్ చేసుకున్నారో వారికి ప్రాధాన్యత క్రమంలో సిలిండర్లు అందిస్తున్నామని గ్యాస్ ఏజెన్సీవారు తెలియజేశారకాబట్టి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మకండి.కరోనా సమయంలో కూడా ఇలాగే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి ప్రజల్లో భయాన్ని సృష్టించారుఇలాంటి బాధ్యతలేని రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలి. అని తెలియజేస్తున్నాము దేశంలో ఎక్కడో యుద్ధ పరిస్థితులు ఉన్నాయనే కారణంతో ప్రజల్లో భయం సృష్టించడం మంచిది కాదు — ప్రజలకు భరోసా ఇవ్వడం బాధ్యత గల నాయకుల పని తెలియజేశారు .ప్రజలకు నా విజ్ఞప్తి — ఎవరైనా బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్లు అమ్ముతున్నట్టు తెలిసినా వెంటనే నాకు సమాచారం ఇవ్వండి. అలాంటి వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు తెలియజేద్దాం…!