చుంచులూరు ఎంపీటీసీ అభ్యర్థిగా బోటిక ప్రసాద్ నామినేషన్ దాఖలు…

0
14

📰 Generate e-Paper Clip

చుంచులూరు ఎంపీటీసీ అభ్యర్థిగా బోటిక ప్రసాద్ నామినేషన్ దాఖలు..

.మర్రిపాడు:(ఇదినిజం ప్రతినిధి ):

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరు ఎంపీటీసీ స్థానానికి టిడిపి తరుపున బోటిక ప్రసాద్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మర్రిపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ప పత్రాలను.చుంచులూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు,మాజీ సర్పంచ్ యలగాల వెంకటేశ్వర్లు, విజయరెడ్డి బలపరచగా పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండల పరిషత్ కార్యాలయం వెలుపల కార్యకర్తలు ఉత్సాహంతో నినాదాలు చేశారు.నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బోటిక ప్రసాద్ మాట్లాడుతూ.. చుంచులూరు ఎంపీటీసీ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పనే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలు, నాయకులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here