సేవా దృక్పథమే మానవత్వానికి జీవనాడి:*

0
10

📰 Generate e-Paper Clip

*సేవా దృక్పథమే మానవత్వానికి జీవనాడి:

పిక్కిలి రమణయ్య కు సహాయ గ్రూప్ సభ్యులు పదివేలు ఆర్థిక సహాయం…

మర్రిపాడు.(ఇదినిజం ప్రతినిధి ):

ఆధునిక సాంకేతికతతో ప్రపంచం ఎంత వేగంగా దూసుకుపోతున్నా, నేటి సమాజంలో ఇంకా మానవత్వం బతికి ఉందంటే దానికి కారణం నిస్వార్థంగా సేవ చేసే గుణం ఉన్న వ్యక్తులేనని పలువురు సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక స్తోమత స్థిరత్వం లేక ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక బాధ ను అనుభవిస్తున్న మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లి గ్రామానికి చెందిన పిక్కిలి రమణయ్య కు స్థానిక సహాయ గ్రూప్ సభ్యులు అండగా నిలిచారు. పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.స్థానిక గ్రామానికి చెందిన పిక్కిలి రవణయ్య ప్రమాదవశాత్తు కాలు విరిగి మంచాన పడ్డాడు.ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసిన నయం కాక పోవడంతో , ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే స్తోమత సన్నగిల్లి ఇంట్లోనే బాధను భరిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఆ వ్యక్తి పరిస్థితినితెలుసుకున్న స్థానిక సహాయ గ్రూప్ సభ్యులు తక్షణమే స్పందించారు.సభ్యులంతా కలిసి తమ వంతుగా నిధులను సేకరించి, బాధిత వ్యక్తి ఇంటికి వెళ్లారు. ఉపాధ్యాయులు ఇస్మాయిల్, నాగేశ్వరరెడ్డి , విజయభాస్కర్ రెడ్డి, కరీముల్లా మల్లికార్జున్ అతడిని పరామర్శించి, వైద్య ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయల నగదును అందజేశారు. స్వార్థం, డబ్బు చుట్టూ తిరిగే ఈ రోజుల్లో కూడా ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే హృదయాలు ఉండటం మానవజాతికి ఒక వరం.ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం ఎటువంటి లాభాపేక్షలేనిసేవామూర్తులవల్లేసాధ్యమవుతున్నాయి.అలాంటి కోవకు చెందిన వారే సహాయ గ్రూప్ సభ్యులు .ధనం ఒక్కటే ఉంటే సరిపోదని, ఇతరులకు సహాయం చేయాలనే మంచి మనస్సు ఉండాలని సహాయ గ్రూవ్ సభ్యులు నిరూపిస్తున్నారు. సమాజంలోని అసమానతలను తొలగించడానికి, కష్టాల్లో ఉన్నవారికి కొండంత అండగా నిలవడానికి సేవా దృక్పథం ఉన్న సహాయ గ్రూప్ సభ్యులు నిరంతరం శ్రమిస్తున్నారు.నేటి యువత కూడా వీరిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆకాంక్షిస్తున్నారు.తోటి మానవుడికి సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం, తృప్తి దాగి ఉన్నాయని ఎంతటి ఇబ్బంది ఎదురైనా, సేవా దృక్పథం కలిగిన వ్యక్తులు ఉన్నంత కాలం మానవత్వం వర్ధిల్లుతూనే ఉంటుందని గ్రామస్తులు మండల ప్రజలు సహాయ గ్రూప్ సభ్యులను కొనియాడుతున్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here