మానవత్వానికి నిదర్శనం:*

0
27

📰 Generate e-Paper Clip

మానవత్వానికి నిదర్శనం:

ఆపదలో అండగా నిలిచిన సహాయ గ్రూప్ సభ్యులకు సెల్యూట్!

*నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలికి ₹25,000 ఆర్థిక సాయం….

*మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):

సమాజంలో స్వార్థం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, తోటి మనుషుల కష్టాలను చూసి చలించిపోయే గుణం కొందరిలోనే కనిపిస్తుంది. అలా ఒకరి హృదయం లో పురుడు పోసుకున్న ఆలోచన ఆర్థిక పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ఆపదలో నిస్సహాస్థితిలో ఉన్న ఎంతో మందికి సహాయం చేస్తూ, మెట్ట ప్రాంత కరువు పల్లెల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు సహాయ గ్రూప్ సభ్యులు వారి సేవలు నిజంగా అమోఘం. మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి పంచాయతీ మజర గ్రామమైన అనంతపురం లో రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తూ ఇల్లు కాలిపోయి తీవ్ర నష్టాన్ని మూటగట్టుకుని, నిస్సహాయ స్థితిలో ఉన్న యన్నం దేవి అనే మహిళకు (సహాయ గ్రూప్) అండగా నిలిచింది. బాధిత మహిళకు కు రూ. 25,000 (ఇరవై ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని గ్రూప్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు మునాఫ్, ఇస్మాయిల్, విజయభాస్కర్ రెడ్డి, వెంకటరెడ్డి, నాగేశ్వరరెడ్డి చాంద్ బాష,చేతులు మీదుగా బాధితురాలుకు అందజేసి తమ ఉదారతను, సేవా భావాన్ని చాటుకున్నారు.స్థానిక గ్రామానికి చెందిన మహిళ నివాసం ఉంటున్న ఇల్లు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. తలదాచుకోవడానికి నీడ తప్ప సర్వస్వం కోల్పోయి ఆమె తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ‘సహాయ గ్రూప్’ సభ్యులు తెలుసుకున్నారు. బాధితురాలి దీన స్థితిని చూసి చలించిన గ్రూప్ సభ్యులు, వెంటనే స్పందించి ఆమెకు తక్షణ ఉపశమనం కోసం ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా సహాయ గ్రూప్ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ గ్రూప్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ చిన్న సాయం ఆమె కుటుంబం మళ్లీ కోలుకోవడానికి కొంతవరకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ తమ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు. సమాజ సేవలో పాల్గొనాలని తపన ఆపదలో ఆర్థిక సాయం అందించాలనే సంకల్పం కలిగిన ఔత్సహికులకు సహాయ గ్రూప్ ఎప్పుడు స్వాగతం పలుకుతుందని గ్రూవ్ సభ్యులు కోరుతున్నారు.ఇటీవల గ్రామాల్లో జరిగిన కొన్ని సంఘటనలలో, ఊహించని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ గ్రూప్ కొందరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించి ప్రాణాలను కాపాడటానికి తమవంతు . రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి చేర్చడం నుండి, పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భరించడం వరకు వీరి సేవా నిరతి కొనసాగుతోంది. సహాయం పొందిన బాధితులు మరియు వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ, “ఆ క్లిష్ట సమయంలో వారు దేవుడిలా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. వారు చేసిన ఈ మేలును మేము జీవితంలో మరువలేము, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది” అని తమ కృతజ్ఞతను చాటుకుంటున్నారు.అత్యంత క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి, రూ. 25,000 నగదును అందజేసిన సహాయ గ్రూప్ సభ్యులకు బాధితురాలు యన్నందేవి కన్నీటిపర్యంతమై కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ప్రతినిధులు మరియు స్థానిక గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here