స్కూల్ స్విపర్స్ బకాయి వేతనాలు విడుదల చేయాలి..

0
16

📰 Generate e-Paper Clip

స్కూల్ స్విపర్స్ బకాయి వేతనాలు విడుదల చేయాలి.. అనంతసాగరం(ఇదినిజం ప్రతినిధి): స్కూల్ స్విపర్స్ కు బకాయి వేతనాలు విడుదల చేయాలనీ స్కూల్ స్విపర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో అనంతసాగరం మండల విద్యాధికారి కార్యాలయం లో వినతిపత్రం ఇవ్వండి జరిగింది. ఆ సంఘం గౌరవ అధ్యక్షులు అన్వర్ బాషా మాట్లాడుతు గత 4నెలల నుండి స్కూల్ స్విపర్స్ కు వేతనాలు విడుదల చేయలేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు చీమ్మి, బాత్రూములు కడిగి స్కూల్స్ ను పరిశుభ్రం గా ఉంచే స్కూల్స్ స్విపర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గం అని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారి వేతనాలు విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో స్కూల్స్ స్విపర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు తిరుపతమ్మ,అదేమ్మ, అమ్ములమ్మ మరియు స్కూల్స్ స్విపర్స్ పాల్గొన్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here