బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (BPHU) భవనాన్ని ప్రారంభించిన…..
– రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
మర్రిపాడు, ఆగస్టు 1:(ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):
రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మర్రిపాడు మండలంలో శనివారం మొత్తం రూ.3.95 కోట్ల (రూ.395.30 లక్షలు) విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు అందులో భాగంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతనంగా రూ.55 లక్షలతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (BPHU) భవనాన్ని మంత్రి ఆనం చేతులు మీదుగా ప్రారంభించారు. నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ వి సుజాత DMHO గారు , స్థానిక మెడికల్ ఆఫీసర్ డా గోపినాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఐసిడిఎస్ శాఖ మరియు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో 2026 ఆగస్టు 1వ తేదీనుండి 7వతేది వరకు నిర్వహించవలసిన మర్రిపాడు పిహెచ్‌సిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి గర్భిణులను ఆశీర్వదించి సారె అందజేశారు. తల్లిపాలే శిశువుకు సంపూర్ణ పోషకాహారం, తొలి రోగనిరోధక శక్తికి మూలమని పేర్కొన్నారు. పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం, తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే అందించడం ప్రతి తల్లి బాధ్యత అని సూచించారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యవంతమైన భావితరం నిర్మాణం సాధ్యమవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ వి సుజాత DMHO , మర్రిపాడు మెడికల్ ఆఫీస్ డా. గోపినాథ్,మరియు కృష్ణపురం య వైద్య అధికారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.





