TUTF రాష్ట్ర సహాధ్యక్షుని గా అక్కపల్లి.యాదగిరి గౌడ్:

0
23

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TUTF) రాష్ట్ర సహాధ్యక్షుని గా అక్కపల్లి.యాదగిరి గౌడ్:

కరీంనగర్. (ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ):

హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా TUTF సీనియర్ నాయకులు మానకొండూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ( సోషల్ స్టడీస్ ) ఎ.యాదగిరి గౌడ్ ను రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఓ ప్రకటనలో తెలియజేసారు.గతంలో కల్చరల్ కమిటీ కన్వీనర్ గా పనిచేసిన అనుభవం సంఘము పట్ల నిబద్ధతతో, అత్యంత విశ్వాసం తో పని చేస్తున్నందున తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( TUTF) రాష్ట్ర సహాధ్యక్షులు ( స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ ) గా అక్కపల్లి యాదగిరి గౌడ్ ని నియమించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TUTF )రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించారు .ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(TUTF )రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ లచ్చిరామ్ మరియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి రఘునందన్ రెడ్డి తెలియజేశారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here