ePaper
Saturday, April 11, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeఎడిటోరియల్*🚩మనిషిగా మలిచిన మానవత్వం

*🚩మనిషిగా మలిచిన మానవత్వం

📰 Generate e-Paper Clip

*🚩మనిషిగా మలిచిన మానవత్వం..

*మర్రిపాడు(👉ప్రభాకర్ మేకల /✍️/ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ✍️):*

మానవత్వాన్ని మించిన దైవత్వం లేదు, మంచితనాన్ని మించిన ఆరాధన లేదు.మానవత్వం అంటే తోటివారి పట్ల ప్రేమ,దయ, కరుణ, మరియు సహాయగుణం కలిగి ఉండటం అని నిరూపిస్తున్నారు చుంచులూరు గ్రామంలో ఎస్సీ కాలనీ యూత్ ఏర్పాటు చేసిన “ఉపకార ” సంస్థ యువకులు. మనిషిని జంతువుల నుండి వేరు చేసి, ఉత్తమ వ్యక్తిగా మార్చేది ఈ గుణమేనని విశ్వశించి కులమతాలకు అతీతంగా సాటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకుని సాయమందించడంలో సఫలమౌతున్నారు.మతిస్థిమితం లేని వ్యక్తిని చేరదీసి సపర్యలు చేసి మనిషిగా మలచి మానవత్వం చాటుకున్నారు “ఉపకార”సంస్థ యువకులు .వివరాలలోకి వెళ్తే కలువాయి నుండి గత 20 సంవత్సరాల క్రితం చుంచులూరు వచ్చిన పోలిపోగు చిన్నయ్య గ్రామంలోనివసిస్తూ,మానసిక స్థిరత్వం లేకుండా వీదుల్లో చెట్ల నీడనసేదతీరుతూ చిరిగిన బట్టలు, పెరిగిన జుట్టుతోఎవరైనా అన్నం పెడితే తిని, రోడ్డుపక్కన పడుకుంటూ జీవితం గడిపేవారు 65 సంవత్సరాల వృద్ధుడికి సహాయం చేయాలని మానవత్వం తో మనిషిగా మలచాలనే ఉద్దేశంతో “ఉపకార” సంస్థ యువకులు గత మూడు నెలలుగా ఎంతో కృషి చేసి సఫళీకృతులయ్యారు.తాగుడు వ్యసనంతో మతి స్థితిమితం సరిగ్గా లేక వీదుల్లో చెట్ల నీడన సేదతీరుతూ చిరిగిన బట్టలతో తిరుగుతున్న అతడికి జుట్టు కత్తిరించి, స్నానంచేయించి కొత్త బట్టలు వేసి కడుపునిండా భోజనం పెట్టి జీవితం మీద ఆశలు పుట్టేలా చేశారు ఉపకార సంస్థ యువకులు.జీవితం గురించి ఆందోళనతో, నిరాశతో ఉన్న ఆ వృద్ధుడు ఇప్పుడు ఎంతో సంతోషంగా, నమ్మకంతో జీవిస్తున్నారు.ఉపకార సంస్థ ద్వారా పోలిపోగు చిన్నయ్య కు ఆధార్ కార్డు గుర్తింపు కల్పించి, ఓటర్ కార్డు, పోస్టల్ బ్యాంకింగ్ ఖాతా, రేషన్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు వంటి అవసరమైన అన్ని పత్రాలను పొందేలా సహాయం చేశారు. అలాగే ఆయనకు శుభ్రతపై దృష్టి పెట్టించి, జీవితంపై అవగాహన కల్పించారు. వీలైనంత వరకు మద్యపానం కూడా మాన్పించేలా మార్గదర్శనం చేస్తున్నారు ప్రస్తుతం చిన్నయ్య పని చేసుకుంటూ ఆనందంగా అందరితో కలిసిమెలిసి జీవితం కొనసాగిస్తున్నారు.మనిషిని మనిషిగా చూడాలి” అనే సందేశాన్ని ఉపకార సంస్థ కార్యరూపంలో చూపిస్తోంది. అవసరంలో ఉన్నవారికి తోడుగా నిలబడటం, వారికి ఆశ నింపటం – ఇదే నిజమైన మనిషిగా మలిచిన మానవత్వం. “ఉపకార” సంస్థ చేస్తున్న ఈ సేవలు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!