ఆపరేషన్ “వజ్రప్రహార్”

0
38

📰 Generate e-Paper Clip

ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా నెల్లూరు జిల్లా కావలి 1టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో కార్డన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన “ఆపరేషన్ వజ్రప్రహార్” కార్యక్రమంలో భాగంగా, జిల్లా ఎస్.పి. డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆధ్వర్యంలో  కావలి 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్డిపాలెం లో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ను కావలి డీఎస్పీ శ్రీ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించగా, మొత్తం 25 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా 250 ఇళ్లను తనిఖీ చేయగా, వాహనాల తనిఖీలలో పత్రాలు లేని 29 బైక్‌లు గుర్తించబడినవి. పోలీసులు ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, రోడ్ సేఫ్టీ, ప్రాపర్టీ నేరాలు మరియు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. ప్రజలు గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే AP EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 లేదా డయల్ 112 కు గాని, కంట్రోల్ రూమ్ 9392903143 కు గాని సమాచారం ఇవ్వాలని కోరారు.రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి చర్యలు కొనసాగుతాయని ఎస్.పి. గారు తెలిపారు

Leave a reply

Please enter your comment!
Please enter your name here