చైతన్యవంతులైన విద్యార్థులను తయారు చేసేది తరగతి గదుల్లోనే కదా .!!
ట్రిపుల్ ఐటీలలో పదిమంది మర్రిపాడు విద్యార్థులకు అవకాశం దక్కడం అభినందనీయం……
మర్రిపాడు.(👉ప్రభాకర్ మేకల /✍️/ఇదినిజం బ్యూరో ఇంచార్జ్✍️ ):
ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటేచైతన్యవంతమైన పౌర సమాజం పాత్ర క్రియాశీలకమైనది.విద్యార్థుల పరిణతి, మార్పుకుఉపాధ్యాయులుదారిదీపాలు.విద్యార్థులసర్వతోముఖ వికాసానికి తోడ్పడేది, అంతరంగిక శక్తులను బయటికి తీసేది, భవిష్యత్తు సవాళ్లను అధిగమించే విధంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు బోదించే విద్య అని మేధావులు చెప్తే విన్నాం నేడు మర్రిపాడు మండల కేంద్రంలో ఉపాధ్యాయ బాధ్యతలు నిర్వహిస్తున్న అందరి శ్రమను వారి ద్వారా మండల కేంద్రం లో విద్యార్థులు పొందిన ఫలితాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. “చైతన్యవంతులైన పౌరులను తయారు చేయడం ఫ్యాక్టరీలలో సాధ్యం కాదు”తరగతి గదుల్లోనే. నేడు ట్రిపుల్ ఐటీలలో ప్రవేశానికి మర్రిపాడు మండలం నుండి పదిమంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంపికైనట్లు మండల విద్యాశాఖ అధికారులు తిరుపతయ్య,ధనలక్ష్మి ప్రకటన చేయడం అభినందనీయం హర్షించదగ్గ విషయం.రాజకీయ యంత్రాంగం పౌర సమాజం ఉపాధ్యాయ లోకం మీద నమ్మకం ఉంచితే ఉపాధ్యాయులు తమ పౌర సామాజిక బాధ్యతలను గుర్తించి నేటి తరాన్ని రేపటి భవిష్యత్తు కోసం తీర్చిదిద్దితుంది అప్పుడే కొఠారి సూచించినట్లు ఆశించినట్లు “దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది.అన్న మాట అక్షర సత్యం అవుతుంది.పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. డిసెంబరు 6 నుంచి మార్చి 15 వరకు యాక్షన్ ప్లాన్ అమలును ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఆశయాలను ఆచరణలో చూపించి విద్యార్థుల భవితకు బాటలు వేసారు.గుడ్డిగా విద్యార్థుల భవిష్యత్తు తరగతిలో రూపుదిద్దుకుంటుంది అనుకుంటే పొరపాటే.విద్యార్థుల బాధ్యతను ఉపాధ్యాయులపై నెట్టి ప్రభుత్వాలు మిన్నకుంటే గాలిలో దీపం లాగే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్ర ప్రభుత్వాలు 30% విద్యకు నిధులను కేటాయించడంతోపాటు ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగినట్లయితే ఆ స్థాయిలో ఉపాధ్యాయులు కూడా పౌర బాధ్యతను నిర్వర్తిస్తే రానున్న రోజుల్లో కచ్చితంగా మండల పరిధిలో పల్లెటూర్లలో విద్యార్థుల రూపురేఖలు మారుతాయి.ఆ మార్పును తీసుకువచ్చే దారి దీపాలు ఉపాధ్యాయులు అవుతారు.