📰 Generate e-Paper Clip

*🫵పాఠశాల మౌలిక వసతుల లేమి ఫై స్పందించిన…*

*✨సాహో పౌండేషన్ వ్యవస్థాపకులు పడచల నాగేశ్వరావు….!*

*👉బీసీ కాలనీ పాఠశాలకు మరమ్మత్తులు షురూ….*

మర్రిపాడు.(👉ప్రభాకర్ మేకల /✍️/ఇదినిజం బ్యూరో ఇంచార్జ్✍️ ):*

మర్రిపాడు మండలం పడమటి నాయుడుపల్లి మజర గ్రామమైన బిసి కాలనీ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోకొన్ని రోజులుగా మౌలిక వసతులు కొరవడ్డాయి.ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న వీరికి ప్రతిరోజు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ఈ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో బాలికలు,బాలురు ఇబ్బందిపడుతున్నారు. బడికి పక్కనే ఉన్న మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకోవడంతో మరుగు కోసం వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఇంటికి.. లేదంటే చెట్ల పొదలలోకి వెళ్లాల్సిందే. రెండేళ్ల క్రితం బాత్‌రూంలు నిర్మించి అసంపూర్తిగా నిలిచిపోయింది.చుట్లూ ప్రహరీ ఉన్న మధ్య లో పడిపోయి ఈ పరిస్థితి వచ్చింది.త్రాగడానికి నీటి సౌకర్యం లేదు బోరింగ్ కు బిగించిన మోటార్ చెతిపంపు రెండు పని చేయడం లేదు సింటేక్స్ ట్యాంక్ ఉపయోగంలో లేదు టీచర్ సొంత ఖర్చులతో పైప్ లైన్ వేసి విద్యార్థులకు దాహం తీర్చుతుంది. చుట్టూ చెట్ల పొదలు ఉండటంతో మిన్నల్లులు విపరీతంగా చేరి విద్యార్థులను కుట్టడంతో శరీరం ఫై దద్దుర్లు పుట్టి విపరీతమైన దురద తో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పత్రికల వారు పేపర్లో ప్రకటించడంతో అందుకు స్పందించిన సాహో పౌండేషన్ వ్యవస్థాపకులు పడచల నాగేశ్వరావు ఊరి బడికి ఊపిరి పోయడానికి తమ పౌండేషన్ ద్వారా పాఠశాలకు మరమ్మత్తులు చెసి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడానికి దయగల హృదయం తో ముందుకు వచ్చారు.శనివారం స్థానిక మండల విద్యా శాఖ అధికారి పి. తిరుపతయ్య , టీచర్ రాజేంద్ర కుమార్, సిఆర్ఎంటి.కస్తూరయ్య, గ్రామస్తులు పడచల శ్రీనివాసులు యాదవ్, సమగ్ర శిక్ష సైట్ ఇంజనీర్ అహ్మద్ తో కలిసి పాఠశాలను సందర్శించి పరిశీలించారు. అసంపూర్తిగా నిలిచి పోయి నిరూపయోగంగా మిగిలిపోయిన మరుగుదొడ్లు కు మరమ్మత్తులు చేయించి వినియోగంలోకి తెస్తామని నాగేశ్వరావు తెలిపారు అలాగే విద్యార్థులకు త్రాగు నీరు, వాటర్ ట్యాంక్, బోరింగ్, బోర్ రిపేర్ చేసి చుట్టూ పడి పోయిన పహరి నిర్మించి పాఠశాల ఆవరణం లో మట్టి తోలి చదును చేసి బడి చుట్టూ ఉన్న కంప చెట్లను పెరికించి విష సర్పాలు రాకుండా విశాలంగా చేసి పాఠశాల భవనానికి అన్నిటికి రంగులు కొట్టి ఊరి బడికి ఊపిరి పోసి విద్యార్థులకు అసౌకర్యం లేకుండా మౌలిక వసతులు కల్పిస్తామని తెలియజేసారు.తక్షణమే పనులు ప్రారంభించారు అలాంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని పేదరికం ఉన్న ప్రతిభావంతుల విద్యను ముందుకు నడిపించడం కోసం నిస్వార్థంగా సాయం చేయడానికి కృషి చేస్తున్న సాహో పౌండేషన్ వ్యవస్థాపకులు పడచల నాగేశ్వరావు కు పౌండేషన్ సభ్యులు టీచర్ రాజేంద్ర కుమార్ కు గ్రామస్తులు విద్యార్థులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

Leave a reply

Please enter your comment!
Please enter your name here