idhinijam.com
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 3:28 pm Digital Edition : Idhi Nijam Desk

హరీష్ రావు గారు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించడం మానుకోండి 

తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మానుక ప్రవీణ్ కుమార్

seబాధ్యత లేని, చేతకాని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని బీఆర్‌ఎస్‌ శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యల పట్ల కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మానుక ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడును విమర్శించడం హరీశ్ రావుకు తగదన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అసత్య ప్రచారాలకు పాల్పడితే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మరోసారి విమర్శిస్తే ఊరుకునేది లేదని హరీష్ రావును హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు ఎండి రఫియోద్దీన్, కొక్కుల మహాదేవ్, నరహరి, బాదాం మోహన్, తెలుగు మహిళా నాయకురాలు దివ్య, జ్యోతి, శాంత, రాణి, లక్ష్మీ, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.