సీ.జె.ఎఫ్ఎస్.. భూములు కలిగిన రైతాంగానికి డికెటి పట్టాలను ఇవ్వాలి……

ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీధర్.
ఆత్మకూరు (ఇదినిజం ప్రతినిధి ):
CJFS భూములకు చెందిన రైతాంగానికి డికెటి పట్టాలను జీవో ఎంఎస్ నెంబర్ 288 అనుసరించే ఇవ్వాలని జన సైనికులు తో కలిసి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీధర్ స్థానిక మున్సిపల్ బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా వెళ్లి ఆర్డిఓ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ,అటు ప్రతిపక్షంలో ఉన్న, ఇటు అధికార పక్షంలో ఉన్న రైతాంగ సమస్యలపై గళమిత్తి రైతు సమస్యలను ప్రభుత్వానికి చేరేవరకు పోరాటం చేసే ఏకైక పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ. రైతుల సమస్యలకు ప్రభుత్వం నుండి పరిష్కారం వచ్చేవరకు అలుపెరగని పోరాటం చేసే పార్టీ మా జనసేన పార్టీ. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలోని చుక్కల భూముల సమస్యలపై గళమెత్తి నాలుగు సంవత్సరాలు పాటు అలుపెరగని పోరాటం సాగించి విజయం సాధించేవరకు పోరాడిన చరిత్ర కలిగిన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ. తద్వారా మన ఆత్మకూరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాలకు చెందిన సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు చెందిన రైతాంగానికి చుక్కలు భూముల సమస్య నుండి విముక్తి లభించిన విషయం మీకు అందరికీ తెలిసినదే. ఇప్పుడు అటువంటిదే గిరిజన, దళిత, బలహీన వర్గాల రైతాంగానికి చెందిన మరొక సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మరొక్కసారి ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ నడుం బిగించింది. ఇది కూడా రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య అయినప్పటికీ నా దగ్గర ప్రస్తుతానికి నెల్లూరు జిల్లా రైతాంగానికి సంబంధించిన వివరాలు మాత్రమే ఉన్నాయి. ఇది నెల్లూరు జిల్లాలో 60,505 రైతు కుటుంబాలకు చెందిన 66276 ఎకరాలకు చెందిన సమస్య. దీని పూర్వపరాల్లోనికి వెళితే 1975 మరియు 1980 సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా గిరిజన, దళిత, బలహీన వర్గాలకు సహకార సంయుక్త వ్యవసాయ సంఘాలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా (కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ, cjfs) కేవలం సాగు చేసి వచ్చిన పలసాయాన్ని అనుభవించుకునే వీలు కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొన్ని లక్షల ఎకరాలను లక్షల నిరుపేద రైతు కూలీ కుటుంబాలకు పంచడం జరిగింది. అప్పటినుండి అనగా గత 50 సంవత్సరముల నుండి వారు ఈ భూములను లను సమిష్టిగా సాగు చేసుకుంటూ వచ్చిన పల సాయంతో తమ జీవనాన్ని సాగిస్తూ వచ్చారు. ఈ cjfs విధానం లో రైతులకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం నుండి వచ్చే రైతు భరోసా, పి.ఎం. కిసాన్ యోజన వంటి సంక్షేమ పథకాలు వీరికి వర్తించవు. మరియు బ్యాంకు వీరికి రుణాలు మంజూరు చేసే అవకాశం లేదు. ఈ సిజెఎఫ్ఎస్ వ్యవసాయ విధానంలో రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన గత కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో ఈ సి.జె.ఎఫ్.ఎస్ విధానాన్ని రద్దు చేసి అందులో లబ్ది పొందుతున్న రైతులకు డీ.కే.టి పట్టాలు ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించి అందుకు అనుగుణంగా జీవో ఎంఎస్ నెంబర్ 288 తేదీ 01-06- 2018 విడుదల చేయడం జరిగింది. ఈ జీవో అమలు చేసే క్రమంలో, 2019 లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలుపడంతో ఈ ప్రక్రియకు అంతరాయం కలిగింది. తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ
సి.జె.ఎఫ్.ఎస్ రైతుల సమస్యలను పట్టించుకోలేదు. దీంతో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా ఈ సి.జె.ఎఫ్.ఎస్ భూముల రైతాంగం పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం, రైతు పక్షపాతి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పార్టీగా జనసేన పార్టీ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి కచ్చితంగా తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. రెవిన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన ఈ సీ.జె.ఎఫ్.ఎస్ భూముల రైతాంగానికి జనసేన పార్టీ అండగా నిలబడి వారి సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.