idhinijam.com
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 6:35 am Digital Edition : Idhi Nijam Desk

సిఐ గంగాధరం కర్తవ్య దీక్షకు విశిష్ట సేవా పురస్కారం…..*

సిఐగంగాధరంకర్తవ్యదీక్షకువిశిష్టసేవాపురస్కారం…..నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ఎస్పీ చేతులుమీదుగాపురస్కారంఅందుకోబోతున్నసిఐగంగాధరం..

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల //ఇదినిజం బ్యూరో ఇంచార్జ్):

2026 ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లాపోలీస్ శాఖ లో విశేష సేవలందించిన పోలీస్ అధికారులకు జిల్లా యంత్రాంగం విశిష్ట సేవా పతకాలను ప్రకటించింది.అందులోభాగంగా ఆత్మకూరు సర్కల్ పరిధిలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నిస్వార్ధంగా విధులు నిర్వహిస్తు ప్రతిభ కనపరిచిన కర్తవ్య దీక్షకు గాను సిఐ గంగాధరం. కు విశిష్ట సేవా పురస్కారం వరించింది.నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, మహిళా భద్రత, డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలలో విశేష కృషి చేశారని విశిష్ట సేవా పురస్కారం సిఐ గంగాధరంను వరించడం సమర్థ నీయమని శాంతి భద్రతలు కాపాడడంలో వారి పాత్ర అభినందనీయమని నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆయన కర్తవ్య దీక్ష, ప్రజా సేవ యువ అధికారులకు ఆదర్శం” అనిఅభినందిస్తున్నారు.నేర నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలో ఆయన చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి నేడు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్బంగా నెల్లూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్పీ చేతులు మీదుగా విశిష్ట సేవా పురస్కారం, ప్రశంశ పత్రం అందుకోవడం గర్వించదగ్గ విషయం అని ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.