idhinijam.com
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 12:32 pm Digital Edition : Idhi Nijam Desk

సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి…..

– ఎస్సై కాసుల.శ్రీనివాసరావు.

మర్రిపాడు.(ప్రభాకర్ మేకల ఇదినిజం బ్యూరో ఇంచార్జ్ ): సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని స్థానిక ఎస్సై కాసుల.శ్రీనివాసరావు. సూచించారు. జిల్లా ఎస్పీ ఆలోచన మేరకు సిఐ గంగాధర రావు సూచనలతో ఆయన కేజీబివి పాఠశాలలో లో బుధవారం విద్యార్థినులకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చట్టాలు, సైబర్‌ నేరాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్,వ్యసనాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై కాసుల.శ్రీనివాసరావు.మాట్లాడుతూ సైబర్ నేరాల నివారణ, గంజాయి వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే అవగాహన పెంపొందిస్తే, రాబోయే రోజుల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.పిల్లలకు సమాజం లో జరిగే సామాజిక అంశాలపై సరైన అవగాహన కల్పిస్తే, రేపటి సమాజం మరింత భద్రమవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు., రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సురక్షిత ప్రయాణ పద్ధతులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు అవగాహన కల్పించినట్లు చెప్పారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కి సమాచారమివ్వాలని అవగాహన కల్పించారు. ప్రస్తుతo డిజిటల్ అరెస్ట్ , జాబ్ ఫ్రాడ్ , సైబర్ స్లావరీ , సైబర్ స్టాకింగ్ , ఏపీకె ఫైల్స్‌ ఓపెన్‌ చేయొద్దని, వాటివల్ల జరిగే మోసాలు ఎక్కువగా ఉన్నాయని, వీటి పైన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సోషల్‌మీడియాపై జాగ్రత్తగా ఉంటూ కెరీర్‌పై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల వారికి వివరించి ప్రమాదాలు నివారించడానికి వారియర్స్ గా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లక్ష్మి దేవి, టీచర్స్ పాల్గొన్నారు.