idhinijam.com
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 8:29 pm Digital Edition : Idhi Nijam Desk

సర్వే లేకుండా సర్వం సమర్పయామి……!!!*

జాతీయ రహదారి భూ సేకరణలో అక్రమార్కుల ఆగడాలు….

నోటిఫికేషన్ లో ఉన్న పేర్లకు వాస్తవిక పట్టాదార్లకు పొంతన ఉందా…..???*

మర్రిపాడు. (👉ప్రభాకర్ మేకల /✍️/ఇదినిజం బ్యూరో ఇంచార్జ్✍️ )*

జాతీయ రహదారుల విస్తరణలో కృషపట్నం టు బద్వేల్ కొత్త జాతీయ రహదారుల నిర్మాణాల కోసం ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణలో మర్రిపాడు మండల పరిధి లో భూఅక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. చోటా రాజకీయ నాయకులు,మరియు భూమాఫియా కుమ్మక్కై లక్షలు రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవడానికి తెర లేపినట్లు బహిరంగ రహస్య ఘటనలు గత కొన్ని రోజులుగా మర్రిపాడు మండలంలో వెలుగుచూస్తున్నా చర్యలు సూన్యం . ప్రభుత్వం సేకరించిన భూములకు ముందుగానే నకిలీ పత్రాలు సృష్టించి, పాత పహాణికి పాతరేసి ఆన్లైన్ లో పేరు ఎక్కించి యజమానులుగా చలామణి అవుతూ పరిహారం పొందడానికి మండల రెవిన్యూ కార్యాలయం లో తహసీల్దార్ జెన్యూన్ సర్టిఫికెట్ పొందే జాతరలో జనాన్ని చూసి అనుమానం వచ్చి ఆరా తీస్తే అక్రమార్కుల గుట్టు రట్టయిందని అసలు పట్టాదారులు ఆరోపిస్తున్నారు.గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్న పేర్లకు వాస్తవిక పట్టాదార్లకు పొంతన లేకుండా పోతుంది.చుంచులూరు రెవిన్యూ లో నాలుగు వేల ఎకరాల భూమిని ఎనిమిది వేల ఎకరాలుగా వెబ్లాండ్ లో సృష్టించినట్లు పత్రికలు వారు ప్రకటించిన పట్టించు కోకుండా క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండా సర్వే నంబర్లను ఆన్లైన్లో పేర్లు సరిపోలకుండా పొంతన లేని సర్వే నంబర్లను గెజిట్ లో ప్రకటించడం సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని నిరూపిస్తుంది. ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలుతో పరిహారం కోసం ప్రయత్నం చేస్తున్నారని (గతంలో NH-565లో కూడానకిలీ పట్టాలతో పరిహారం పొందారని ) విచారణ చేసి వాస్తవ పట్టదారులకు మాత్రమే పరిహారం కోసం సిఫారసు చేసి నకిలీ పట్టాలపై చట్టపరమైన చర్యలు తీసుకొనిప్రజాధనాన్ని కాపాడాలని ఓ సీనియర్ జర్నలిస్ట్ అప్పటి కలెక్టర్ కు సమగ్ర సమాచారం తో అర్జీ సమర్పించారు అప్పటి రెవిన్యూ డివిజనల్ అధికారి వారికి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన కార్యరూపం దాల్చకపోవడం విచారకరం.ఇప్పటికైనా జాతీయ రహదారుల నిర్మాణాల కోసం ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణలో భూఅక్రమణ దారులపై జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల స్పందించి, సమగ్ర విచారణ జరిపి, నిజమైన బాధితులకు న్యాయం చేయాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.